సిఐడి కోర్టులో చంద్రబాబు రిపోర్టును సిఐడి చివరి క్షణంలో సబ్మిట్ చేసింది. ఈ రిమాండ్ రిపోర్టు చూసిన న్యాయనిపుణులకు సైతం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని సమాచారం. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఆధారం గురించి చెప్పకపోగా.. ఇప్పటివరకు సాక్షి మీడియాలో వచ్చిన కథలతో పాటు సజ్జల చెప్పిన మాటలే ఎక్కువగా కనిపించాయని.. చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఒక్క ఆధారం కూడా సరిగా లేదని… న్యాయనిపుణులు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.
పెండ్యాల శ్రీనివాస్ – కిలారు రాజేష్ అనే వ్యక్తులకు డబ్బులు అందాయని చెప్పారు. ఎలా చెప్పగలరు అంటే ఆధారాలను ఐటి శాఖను అడిగామని ఇంకా రావాల్సి ఉందని కబుర్లు చెబుతున్నారు. అంటే ఐటీ శాఖ ఆధారాలు ఇవ్వకుండానే వీరిద్దరికి డబ్బులు అందయని ఊహించేసుకుని కేసు పెట్టారని సిఐడి రిపోర్ట్ లో చెప్పినట్లు అయింది. వారి ఇద్దరికీ డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చామని… తర్వాత వారి విదేశాలకు వెళ్లారని చెప్పుకొచ్చారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండున్నర ఏళ్ళు అయినా ఇప్పటికీ ఎందుకో ఆధారాలు ? కనిపెట్టలేకపోయారన్నది మాత్రం కోర్టు ముందే చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు ఏ 1 అంటూ నీలి, కూలి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ రెమాండ్ రిపోర్టులో ఆయనను ఏ 37 గా పేర్కొన్నారు. పైగా ఆయన అంతిమ లబ్ధిదారు అనడానికి తప్పు చేశారనడానికి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు.
నిధుల దుర్వినియోగం అయిందని ప్రభుత్వానికి నష్టం వాటిలిందని చంద్రబాబు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తారని ఇలా 28 పేజీల్లో ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ ఆరోపణల తరహాలో చేశారు. విచిత్రం ఏంటంటే నిధులు దుర్వినియోగం అయ్యాయని సాక్షిపత్రికలో వచ్చిన కథలే ఇంగ్లీష్ లో ఇక్కడ పొందుపరిచినట్టుగా ఉందన్న చర్చ గట్టిగా నడుస్తోంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఏమిటన్న ?దానిపై చిన్న ఆధారాన్ని కూడా సిఐడి చూపించలేదు.
మొత్తంగా చంద్రబాబు అలా చేశారన్న ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అయితే సిఐడి చెబుతున్న 271 కోట్ల నిధులు దుర్వినియోగం స్కిల్ కంపెనీల కాంట్రాక్టు పొందినవారు జీఎస్టీ ఎగ్గొట్టడానికి రకరకాలుగా తిప్పుకున్నారు. అది జిఎస్టి – ఈడీ చూసుకుంటున్నాయి. ఐదేళ్ల కింద కేసులు అయ్యాయి. కానీ ఇందులో చంద్రబాబుకు ఇతరులకు సంబంధం ఏమిటన్నది సిఐడి చెప్పలేకపోతోంది. బాబు నీతి, నిజాయితీకి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి.