ప్ర‌జ‌ల్లోకి భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి… ఎన్నిక‌ల‌య్యేంత వ‌ర‌కు ఏపీలోనే…!

ఏపీ రాజకీయాలు ఊహించినంతగా మారిపోతున్నాయి. ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం కోసం ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లొకేషన్ పై జగన్ ప్రభుత్వం అక్రమ వేధింపులకు పాల్పడుతుందని.. తప్పుడు కేసులలో ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని న్యాయం మీరే చెప్పాలంటూ అటు అత్తా కోడలు బ్రాహ్మణి ..భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఇప్పటికే ఒక కార్యచరణ సిద్ధమైందని చెబుతున్నారు. నారా లోకేష్ పైన సిఐడి చీప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్టు చేస్తామంటూ పరోక్షంగా చెప్పారు. ప్రతిపక్ష నేతల అరెస్టులు.. వారిపై కక్ష సాధిస్తున్నారని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వంపై అంత తీవ్రమైన వ్యతిరేకత లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అని వేడుకోవడంతో ఆ సానుభూతే కనిపించింది.

ఒకవేళ నిజంగా ఇప్పుడు చంద్రబాబు, తెలుగుదేశం పట్ల ప్రజల్లో విశ్వాసం లేకపోతే బాబును అక్రమంగా అరెస్టు చేస్తుంటే ఎక్కడికక్కడ మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఆయన కాన్వాయ్‌ను ఆపే, అడ్డుకునే ప్రయత్నం చేయరు. ఇక బ్రాహ్మణి – భువనేశ్వరి వచ్చే ఎన్నికలకు వరకు కూడా ఏపీలోనే ఉండి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రణాళికలు అయితే నడుస్తున్నాయి. వీరిద్దరు ప్రజల్లోకి వెళితే మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే పూర్తిస్థాయిలో ఫలితాలు ఏకపక్షం అవుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన కోసం పనిచేసిన పాదయాత్రలు.. ప్రచారాలు చేసిన తల్లి విజయలక్ష్మి – సోదరి షర్మిలను దూరం చేసుకున్నారు. అది కూడా మహిళల పట్ల జగన్ ఎలా ? ఉంటారు అన్న విషయాన్ని భువనేశ్వరి – బ్రాహ్మణి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళన‌న్నారని తెలుస్తోంది. రాజ్యాంగం ద్వారా వచ్చే అధికారాన్ని జగన్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని అన్న విషయాన్ని కూడా వీరు ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఆలోచన చేస్తున్నారు.

ఏది ఏమైనా ఎప్పటికే లోకేష్ – చంద్రబాబు ఇద్దరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. రేపటి రోజున భువనేశ్వరి – బ్రాహ్మణి కూడా ప్రజాక్షేత్రంలోకి దిగితే అది కచ్చితంగా టిడిపికి ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.