తుమ్ము ఆపుకుంటున్నారా… మీరు డేంజ‌ర్‌లోకి వెళ్లిపోయిన‌ట్టే..!

తుమ్ములు రావడం సహజం. కొంతమంది తుమ్మడానికి సిగ్గుపడి ఆపుకుంటారు. మీటింగ్ సమయంలో లేదా ఇతర సీరియస్ కార్యక్రమాల్లో చాలామంది తుమ్ముని ఆపుకుంటారు. ఇలా ఆపడం వల్ల ఒక్కసారి ప్రాణాంతకం అవుతుంది. ముక్కు నరాలు చిట్లడం వంటివి జరుగుతాయి. ఒక వ్యక్తి అలా చేయడం వల్ల తన గొంతుని కోల్పోయాడు. అసలు తుమ్మును ఆపడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

బ్రిటిష్ వ్యక్తి బహిరంగ ప్రదేశాంలో తుమ్మేందుకు సిగ్గుపడి తుమ్మును ఆపుకున్నాడు, నోటిని కూడా చెయ్యి అడ్డం పెట్టుకుని మూసేశాడు. దీంతో ఒక్కసారిగా ముక్కు, నోటి నుంచి గాలి వెళ్లే మార్గం లేక గాలి బుడగల రూపంలో చాతిపై ఒత్తిడి చేపట్టడంతో మెడ చుట్టూ ఉన్న నరాలు ఉబ్బుపోయి చనిపోయే స్థితికి వచ్చాడు. గొంతులో ఉండే ఫారింక్స్ అంతా సులభంగా చీలిపోదు. పదేపదే వాంతులు, దగ్గు, బాహ్య గాయం కారణంగా మాత్రమే చీలీపోయే అవకాశం ఉంది.

కానీ ఈ వ్యక్తి విషయంలో గాలి బయటకు వెళ్లే మార్గం లేక గాలి బుడగలు అతని చాతిలోని కణజాలం, కండరాల్లో స్థిరపడటం ప్రారంభించాయి. దీంతో మెడ అంతటా పాపింగ్, పగుళ్లు ఏర్పడ్డాయని వైద్యుకులు చెప్పారు. ప్రస్తుతం తనకి ఫీడింగ్ ట్యూబ్ ఏర్పాటు చేశామని దాని సహాయంతో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పారు.

అసలు ఎందుకు తుమ్ము వస్తుందంటే ధూళి, పుప్పాడి, పొగ వంటి ఇతర కారణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చికాకు కలిగించడంతో ఇది జరుగుతుంది. ముక్కులోని డస్ట్ క్లియర్ చేసేందుకే తుమ్ము వ‌స్తుంది. ఇది ముక్కుకి బ్యాక్టీరియా, బగ్ ల దాడి నుంచి రక్షణ ఇచ్చే ఒక్క సాధనం లాంటిది. మనం తుమ్మగానే తుమ్ముతో కూడిని గాలి బయటకు బలంగా వస్తుంది. దీనివల్ల గాల్లోకి సూక్ష జీవులు ఈజీగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగానే తుమ్ము వచ్చినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్ముతూ ఉంటారు.

అదేపనిగా వచ్చే తుమ్ములతో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రకాల సీజన్లో మరీ ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. గట్టిగా తుమ్మితే ఒక్కసారి తుమ్ము నుంచి రక్తం కారడం కూడా జరుగుతుంది. చాలావరకు తుమ్ములు ఆందోళన కలిగించేవి కాకపోయిన తుమ్ములు ఆపుకోకుండా ఉంటేనే మంచిదంటున్నారు వైద్యకులు. తుమ్ము అనేది మానవ శరీర ధర్మం. తుమ్మడానికి సిగ్గు పడకండి. ఇది అందరికీ కామన్ కాబట్టి లేనిపోని రిస్కులతో ప్రాణాలు మీదికి తెచ్చుకోకండి.