గీతా గోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నది. తన అభినయంతో అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందుతున్నా అంతే స్థాయిలో కష్టాలను ఎదుర్కొంటున్నది. మొదటగా ప్రియుడితో తెగదెంపులు చేసుకుంది. మొన్నటికి మొన్న ఆమె ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించింది. తాజాగా తన రెమ్యూనరేషన్ అంశంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
ఈ కన్నడ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా మారిపోయింది. ఇటీవలే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్‌బాబుకు జోడిగా నటించి చక్కటి విజయాన్ని అందుకుంది. త్వరలోనే నితిన్ సరసన ఆమె నటించిన భీష్మ చిత్రం తెరమీదకు రానుంది. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రానున్న సినిమాలోనూ అవకాశాన్ని దక్కించుకుంది. ఇటు తెలుగులో, అటు కోలివుడ్‌లోనూ అనతి కాలంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోనే ఈ అమ్మడు అడుగు పెట్టబోతున్నది. కార్తకి హీరోగా చేస్తున్న సుల్తాన్ సినిమాలో నటించనుంది.
ఇలా వరుస సినిమాలు, అదీ అగ్రహీరోలతో ఆఫర్లు వస్తుండడంతో ఈ భామ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందట. ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నదట. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంపై నటి తాజాగా స్పందించింది. మేమూ జీతాగాళ్లమే.. అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే క్యాష్ చేసుకోవాలి. అందులో తప్పేం లేదుగా అంటూ సమర్థించుకుందట. అంతేగా మరి ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పడు పరిస్థితులు లేవు. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. హీరోయిన్లు అందరూ చేస్తున్నదే.