అవును.. త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నా.. పబ్లిక్ గా బండారాన్ని బయటపెట్టిన హీరోయిన్..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ బిందు మాధవి కెరీర్ మొద‌టిలో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఈ అమ్మడు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగించింది ఈ ముద్దుగుమ్మ.. కాగా గత సంవత్సరం బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి బిందు మాధవి మరోసారి అవకాశాలను అందుకుంటుంది.

HBD Bindu Madhavi: హ్యాపీ బర్త్ డే బిందు మాధవి.. తెలుగింటి ఆవకాయ బిర్యానీ..  | Happy Birthday Bindu Madhavi Do You Know Facts About Her Avakaya Biryani  Actress– News18 Telugu

ఈ క్రమంలోనే ఆమె తాజాగా నటించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఈనెల 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌న్లు మొదలుపెట్టారు. తాజాగా న్యూసెన్స్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన ప్రెస్మీట్‌లో న్యూసెన్స్ టీం పాల్గొంది.. అయితే ఈ ప్రెస్ మీట్ లో బిందు మాధవికి ఎవరు ఊహించిన ప్రశ్న ఎదురయింది .. ఆమెకు మీరు త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్న వచ్చింది.

 Bindu Madhavi About Dating Trisha Ex Boyfriend-TeluguStop.com

ఆ ప్రశ్నకు ఆమె అందులో కొంత నిజం.. కొంత అబద్ధం ఉందని చెప్పింది.. త్రిష బాయ్ ఫ్రెండ్ ను ప్రేమించిన మాట నిజమే.. కానీ ఒకేసారి మేమిద్దరం ప్రేమించలేదని ఆమె చెప్పుకొచ్చింది. త్రిష‌తో బ్రేకప్ అయిన తరువాత నాతో డేట్ నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది బిందుమాధవి. టాలీవుడ్‌లోనూ ఇతర ప‌రిశ్ర‌మ‌లోను సీక్రెట్ యవ్వారాలు నడిపించి.. పైకి ఏమీ లేన‌ట్లు ముచ్చట్లు చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు.

Telugu Aha Ott, Bigg Boss, Bindhu Madhavi, Newsense, Trisha, Varun Manian-Movie

వాళ్లలా కాకుండా.. తన ఎఫైర్ గురించి సూటిగా సుత్తిలేకుండా చెప్పేసింది బింధుమాధవి. ఇలా త్రిష మాజీ ప్రియుడితో బిందు మాధవి డేటింగ్ చేసిందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో బిందు మాధవి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక న్యూసెన్స్ వెబ్ సిరీస్‌లో నవదీప్ లీడ్ రోల్ చేస్తుండగా, బిందు మాధవి హీరోయిన్‌గా నటించింది.’