టీడీపీ అధినేత చంద్రబాబే లక్ష్యంగా వైఎస్ జగన్, బీజేపీ వ్యూహాలు

అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్షనేత చంద్రబాబే టార్గెట్గా ఇటు వైసీపీ అధినేత జగన్, అటు బీజేపీ కేంద్ర పెద్దలు పావులు కదుపుతూ వస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా? అడ్డంగా బుక్ చేద్దామని సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా  పాలన పగ్గాలను చేపట్టిన వెంటనే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, తీసుకున్న నిర్ణయాల్లోని లోసుగులను తవ్వితీసేందుకు ఏకంగా ఓ కేబిఏట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. ఇక అందరూ ఊహించినట్లుగానే, జగన్ ఆకాంక్షించినట్లుగానే  సీఆర్డీఏ పరిధిలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.   అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న కార్మిక శాఖలో అవినీతి జరిగిందని ముందే ఈ కమిటీ తేల్చింది.  తాజాగా దీనిపై విజిలెన్స్ అధికారులు దానిని ద్రువపరచడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా విచారణకు ఆదేశించడం గమనార్హం.  ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సమగ్రంగా విచారించాలని నిర్ణయించింది. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరపనుంది. ఇంటెలిజెన్స్ ఐటీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల సిట్ బృందం వీటిని విచారించనుంది. ఈ మేరకు ఏపీ  ప్రభుత్వం జీవోను జారీ చేసింది.  దాని ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు కట్టబెట్టింది ప్రభుత్వం. అదీగాక అవినీతికి ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసి, చార్జ్ షీట్‌లు ఫైల్ చేసే అధికారం కూడా కల్పించింది. అదే  విధంగా అన్ని శాఖల అధికారులు సిట్‌కు సంపూర్ణ సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఏవైనా భూ రికార్డులు అవసరం అయితే, వారికి వాటిని అందించాలని కూడా సూచించడం విశేషం. మొత్తంగా బాబును బుక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.

మరోవైపు బీజేపీ సైతం బాబుపై ప్రతీకారం తీర్చుకునే పనిలో నిమగ్నమైందని తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో బాబు జట్టు కట్టడమేగాక ఆ పార్టీ గెలుపుకోసం పెద్దమొత్తంలో ఆర్థిక సాయం చేశారని అప్పట్లోనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అ చిట్టాను వెలికి తీస్తున్నది కేంద్ర సర్కారు. ఇప్పటికే పలువురు బాబు అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి అందుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిందని సమాచారం. వాటి ఆధారంగానే ఇటీవల బాబు మాజీ పీఎస్ ఇంటిపైనా ఐదురొజుల పాటు సోదాలు నిర్వహించి మరిన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తున్నది. ఆందులో భాగంగానే కర్ణటక కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసే అహ్మద్ పటేల్  పైనా దృష్టి సారించింది. ఇప్పటికే ఆయనను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులను జారీ చేసింది. త్వరలోనే బాబు పేరు కూడా తెర మీదకు వచ్చే అవకాశముందని తెలుస్తున్నది. వీటితో బాబుకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. మొత్తంగా చంద్రబాబును రాజకీయంగా పూర్తిగా దెబ్బకొట్టాలని ఇటు వైసీపీ, అటు బీజేపీ తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నాయి.

Tags: ap cm jagan mohanreddy, bjp central leders, chandrababu, it rides