మ‌ళ్లీ సినిమా ట్రాక్‌లో ప‌డ్డా మంచు ఫ్యామిలీ.. !

మంచు మోహ‌న్ బాబు కుటుంబం తిరిగి మ‌ళ్లీ గాడిలో ప‌డింది. సినిమా ట్రాక్‌పైకి వ‌స్తున్న‌ది. వ‌రుస‌గా ఆ కుటుంబంలో ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు సినిమాల‌ను చేస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నారు. క‌లెక్ష‌న్ మోహ‌న్‌బాబు కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. గాయ‌త్రిలో సినిమాలో క‌నిపించిన ఆయ‌న మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు. మ‌హాన‌టి సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో అక్క‌డ‌క్క‌డ మెరిశారంతే. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించనున్నారు. ఇదిలా ఉండ‌గా కొర‌టాల శివ ద‌ర్వ‌క‌త్వంలో, చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమాలోనూ మోహ‌న్‌బాబు న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో ఇద్ద‌రు, ముగ్గురు ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం ఆయ‌న‌తో సినిమాల‌ను చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

అదేవిధంగా 0మంచు కుటుంబంలో విష్ణు. స్టార్ హీరో కుమారుడిగా పరిచయమైనా గతంలో ఈ బాబు చేసిన చాలా చిత్రాలు చేసిన అందులో స‌గానికిపైగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఢీ, మ‌రో రెండు సినిమాలు మిన‌హా ఏవీ అంత‌గా ప్రేక్ష‌కుల‌ను అలరించలేదు. కెరీర్‌ను మ‌లుపు తిప్పేలా ఒక్క హిట్టును కూడా అందుకోలేదు. దీంతో సినిమాల‌కు బ్రేక్ చెప్పాడు. కుటుంబ వ్యాపారాల మీద‌నే ఇంతకాలం దృష్టిని కేంద్రీక‌రించాడు. చాలా రోజుల విరామం త‌రువాత ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ భాషాల్లో ‘మోసగాళ్లు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ మధ్య ఆయ‌న పుట్టిన రోజును పురస్క‌రించుకుని ఆ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. అదీగాక సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ల‌పై విష్ణునే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తుండ‌గా, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న‌ది. బాలివుడ్ నటుడు సునీల్‌ శెట్టి, రుహానీ సింగ్‌లు కూడా నటిస్తుండ‌గా, వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు విష్ణు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గానే తాజాగా మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో మోహ‌న్‌బాబు ఓ భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. దాదాపు 60కోట్ల‌తో తెర‌కున్న ఈ పౌర‌ణిక చిత్రంలో విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప‌గా ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని టాక్‌. సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌రంలోనే వెల్ల‌డిస్తామ‌ని మోహ‌న్‌బాబు ప్ర‌క‌టించారు.

మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కేరీర్ కొద్దిమేర ఆశించిన రీతిలోనే సాగింది. విల‌క్ష‌ణ క‌థాంశాల‌ను ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు. కేరీర్‌లో ఎంతో కొంతో ప్ర‌త్యేక‌త‌ను విజ‌యాల‌ను అందుకున్నారు. అందులో వేదం, బిందాస్‌, క‌రెంటుతీగ వంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. పెళ్లి త‌రువాత సినిమాల‌కు విరామం ప్ర‌క‌టించాడు. ఆ వివాహ బంధానికి బ్రేక్ చెప్పాడు. తాజాగా మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెట్టాడు. ‘అహం బ్రహ్మస్మి’ అనే భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న‌ట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇలా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు వరుసగా సినిమాలను ప్రకటిస్తూ మంచు ఫ్యామిలీ అందరికి షాక్ ఇస్తోంది.

మోహ‌న్‌బాబు గారాల ప‌ట్టి మంచు ల‌క్ష్మి. అంత‌ర్జాతీయ స్థాయిలో సీరియ‌ళ్లు, టీవీ యాంక‌ర్‌గా రాణించిన ఈ భామ తెలుగు మాత్రం త‌న‌దైన ముద్ర‌ను వేసుకోలేక‌పోయింది. విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకున్నా ఆశించిన స్థాయిలో ఆ సినిమాలు ప్ర‌ధ‌ర్శితం కావ‌డం లేదు. దీంతో సినిమాల‌కు విరామం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో వ్యాఖ్య‌త‌గా కొన‌సాగుతున్న‌ది. అదీగాక ఇటీవ‌లే చిట్టి చిల‌క‌మ్మ అనే యూట్యూబ్ చాన‌ల్‌ను ఏర్పాటు చేసి పిల్ల‌ల పెంప‌కంలో పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై త‌ల్లిదండ్రుల‌కు స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను ఇస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు చేతిలో ఏ ఒక్క సినిమా లేక‌పోయినా, త్వ‌రంలోనే ఈ అమ్మ‌డు కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తున్న‌ది.

Tags: aham brahasmi, lakshmi, manchu mohanbabu, manoj, mosagaallu, vishnu