ముకుందా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూజా హెగ్డే. ఆ తరువాత నాగచైతన్య తొ ఒక లైలా కోసం సినిమాలో జోడిగా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు ఏమంత ఆడకపోవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలివుడ్ బాట పట్టింది ఈ భామ. అక్కడ ఏకంగా హృతిక్ సరసన మొహంజదారో సినిమాలో నటించే అవాకాశాన్ని దక్కించుకుంది. కానీ అదీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అక్కడా ఈ పొడగరి సుందరికి చుక్కెదురైంది. ఇలా కెరీర్ ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఏదయితేనేం మొత్తంగా ఆ తరువాత మహర్షి సినిమాతో మంచి హిట్టును అందుకుంది. ఆ జోలులోనే అరవింద సమేత వీర రాఘవ, ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాలతో వరుస విజయాలను చవి చూసింది. ఆ సినిమాలతో దర్శక నిర్మాతలు ఆమె కాల్షిట్ల కోసం క్యూ కడుతున్నారు. కానీ ఈ భామ మాత్రం వారెవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట అందాల తార.
ఇంతకీ కారణం ఎమిటంటే ఈ భామ మళ్లీ ముంబాయి పట్టనుందట. వరుసగా సినిమా చాన్స్‌లు దక్కే చాన్స్ ఉన్నా.. వాటన్నిటినీ వదులుకొని ముంబై చెక్కేయాలని పూజా తీసుకున్న నిర్ణయం తెలిసి ప్రేక్షకులు సైతం విస్మయం చెందుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ భామ బాలివుడ్ కు మకాం మార్చుతుండడంపై తెలుగు అభిమానులు ఇప్పుడే చిన్నబోతున్నారు. అసలు ఏమిటిదంతా అనుకుంటున్నారా? పూజ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆలోచిస్తున్నారా? కారణం ఏమై ఉంటుందనుకుఐటున్నారా? అందులో ఆలోచించడానికి ఏముంటుంది. తారలు ఎవరైనా ఏం చేస్తారో ఈ భామ అదే చేస్తున్నది. వచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. ఎక్కడ పేరు ప్రఖ్యాతలు ఎక్కువ లభిస్తే అక్కడికి జాలుకుంటారు. అదే బాటలో ఈ అమ్మడూ పయనిస్తున్నది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సుందరికి బాలీవుడ్ నుంచి కూడా భారీ అవకాశాలు తలుపుతడుతున్నాయట. నదియాద్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ మీద ఫర్హద్ సాంజి డైరెక్షన్‌లో కండల వీరుడు సల్మాన్ఖాన్ నటించబోయే ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో ఇప్పటికే పూజా పేరు ఖరారైందట. అదే విధంగా విలక్షణ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న అక్షయ్ కుమార్ సరసన కూడా నటించే అవకాశం తలుపు తట్టిందట వారుద్దరితోపాటు అజయ్ దేవగణ్ సినిమాలో కూడా పూజా హెగ్డేను తీసుకోవడానికి ఆచిత్ర బృందం చర్చలు జరుపుతున్నట. ఈ నేపథ్యంలోనే
తెలుగులో గతంలో సంతకం చేసిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలాగే, రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న జాన్ సినిమాలు మినహా మళ్లీ మరే కొత్తగా సినిమాను పూజాహెగ్డే ఒప్పుకోవడం లేదట. తన కెరీర్‌లో రెండు బిగ్గెస్ట్ హిట్లను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కే నో చెప్పిందని సమాచారం. ఇప్పుడిదే టాలివుడ్ లో చర్చనీయాంశంగా మారింది. పూజా నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుంటే మరికొందరు విభేధిస్తున్నారు.