రికార్డ్ రేటుకు ‘ బ్రో ‘ శాటిలైట్ డీల్ క్లోజ్‌… బ‌డ్జెట్‌లో ఎంత వ‌చ్చిందంటే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ వినోదయ సీతం రీమేక్‌. తాజాగా ఈ సిన‌మా తెలుగు వెర్ష‌న్‌కు బ్రో టైటిల్ ఫిక్స్ చేశారు. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కోలీవుడ్‌ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వ‌హిస్తున్నారు.

తమిళ్‌లో కూడా సముద్రఖని ఈ సినిమాను తెర‌కెక్కించాడు.ఈ సినిమా అక్కడ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో స‌ముద్ర‌ఖ‌ని దర్శకత్వంలోనే ఇక్కడ కూడా రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో సముద్రఖని చేసిన పాత్రనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసాడు.

ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం కంప్లిట్ అయిన‌ట్లు తెలుస్తుంది. మిగిలిన షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా బ్రో అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంవ‌త్స‌రం జూలై 28న రిలీజ్ చేస్తున్నాట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది.

Sai Dharam Tej's reaction after getting chance with Pawan Kalyan | 123telugu.com

ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కులు రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ల్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 40 కోట్ల‌కు సొంతం చేసుకుంద‌ట‌. ఇది నిజంగానే భారీ ధ‌ర ప‌లికిన‌ట్టు చెప్ప‌లి. దీంతో ఈ సినిమా బ‌డ్జెట్‌లో స‌గం డిజిట‌ల్స్ రైట్స్ రూపంలోనే వ‌చ్చేసింద‌ని అంటున్నారు. ఇది నిజంగానే ప‌వ‌న్ ఛ‌రిష్మా అని చెప్పాలి.