ఆ ద‌రిద్ర‌పు సెంటిమెంట్‌కు బాబాయ్ – అబ్బాయ్ ఫుల్‌స్టాప్ పెడ‌తారా…!

చాలు ఇక చాలు ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క..! రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నారు.. మేటర్ ఏంటంటే.. ఈమధ్య టాలీవుడ్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని మార్చేయాలని చేస్తున్నారు బాబాయ్ – అబ్బాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఇద్దరూ కోలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.

Game Changer: Ram Charan's 'RC15' Official Title Announced On His Birthday,  First Motion Poster OUT: Watch

రామ్ చరణ్ సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కోలీవుడ్ నటుడు కం దర్శకుడు అయిన సముద్రఖ‌నితో బ్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్‌తో పాటు మ‌రో మెగా హీరో అయిన మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టిస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.

దానికి ప్రధాన కారణం గత 15సంవత్సరాలకు కోలీవుడ్ దర్శకులతో తెలుగు హీరోలు చేసిన ప్రతి సినిమా డిజాస్టర్లుగా మిగిలుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన అన్నీ సినిమాలు ప్లాపే. లింగుస్వామి వారియ‌ర్‌, వెంక‌ట్ ప్ర‌భు క‌స్ట‌డీ, ఎస్‌.జె. సూర్య కొమ‌రంపులి, విష్ణువ‌ర్థ‌న్ పంజా ఇలా చాలా సినిమాలు ప్లాపులే.

Bro motion poster: Pawan Kalyan is back in business | Entertainment  News,The Indian Express

ఇక మ‌హేష్‌కు బాబుకు మురుగ‌దాస్‌తో స్పైడ‌ర్ దెబ్బ అదిరింది. అయితే బాబాయి అబ్బాయి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు పులిస్టాప్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో చేసే సినిమాలతో హిట్ కొడితే మాత్రం టాలీవుడ్ లో ఓ చరిత్రగా నిలిచిపోతారు. ఇక మరి చూడాలి ఈ బాబాయి అబ్బాయి ఏ వరకు మెప్పిస్తారో..!