బ్రేకింగ్‌: 50 వేల భారీ మెజార్టీతో టీడీపీ గెలుపు…!

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసిపి దూకుడుకు తెలుగుదేశం పార్టీ బ్రేక్ వేసింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలలో వైసీపీ కేవలం 169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఈసారి ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఓటు హక్కు ఇవ్వడం.. వారిలో చాలామంది వైసీపీ సానుభూతిపరులు ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చూస్తే వైసిపి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక పట్టభద్రుల నియోజకవర్గాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర – తూర్పు రాయలసీమ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేపాడ చిరంజీవి – కంచర్ల శ్రీకాంత్ ఇద్దరు భారీ మెజార్టీలతో విజయం వైపుగా దూసుకుపోతున్నారు. ఇక పశ్చిమ రాయలసీమ పట్టబుద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వారు కావటం విశేషం.

ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు సాగనుంది ఉత్తరాంధ్ర – తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు లాంఛనం కానుంది. ఉత్తరాంధ్ర నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వేపాడ చిరంజీవి ( ఎకానమీ చిరంజీవి ) 50 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు.. అభిమానులు సంబరాలు ప్రారంభించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం 50 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్ర‌భుత్వంపై ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త ఉందో నిరుద్యోగులు, చ‌దువుకున్న వారు, యువ‌త చెప్పేశారు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన కంచర్ల శ్రీకాంత్ కూడా 25 నుంచి 30 వేల కోట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించమన్నారు. ఏదేమైనా ఈ ఫలితాలు నిరుద్యోగులు, విద్యార్థులు. యువత జగన్ ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో స్పష్టంగా తెలియజేశాయి. ఇప్పుడు ఇదే విషయం ఏపీ రాజకీయ వర్గాల్లోనూ హాట్‌ టాపిక్ గా మారింది.