బిగ్ బ్రేకింగ్‌: ఇండ‌స్ట్రీలో విషాదం… హోట‌ల్లో యంగ్ హీరోయిన్ ఆత్మ‌హ‌త్య‌

సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఏకంగా రెండు తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే వెంటనే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ భోజ్‌పురి యంగ్ హీరోయిన్ ఆకాంక్ష దుబే ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఓ హోటల్లో ఆమె విగత‌జీవిగా కనిపించారు.

దీంతో భోజ్‌పురి సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆకాంక్ష వయసు కేవలం 25 సంవత్సరాలు కావటం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యంగ్ హీరోయిన్ 25 సంవత్సరాలకే బలవ‌న్మ‌రణానికి పాల్పడటం ఎవరికీ అంతు పట్టడం లేదు. విచిత్రం ఏంటంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందే పవన్ సింగ్ తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను కూడా విడుదల చేశారు.

ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఆకాంక్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా ఇన్ స్టా గ్రామ్‌లో డ్యాన్స్ రీల్స్‌ చేస్తూ తన అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఆకాంక్ష 21 అక్టోబర్, 1997న ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్‌లో జన్మించింది. ప్రేమికుల‌ రోజు సందర్భంగా ఆకాంక్ష తన ఇష్టాలు తన రిలేషన్ షిఫ్‌ని కూడా అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమరసింతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది.

ఆకాంక్ష 2018లో డిప్రెషన్ తో బాధపడి కొద్దిరోజులపాటు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆ తర్వాత కోలుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆమె మేరీ జంగ్ మేరా పైస్లా అనే సినిమాతో త‌రంగేట్రం చేసింది. అలాగే ముజే షాది కరోగి, ఫైటర్, కింగ్‌స్కం, పైడా కర్నే కేఐ సినిమాలలోనూ ఆమె నటించింది. ఏది ఏమైనా చిన్న వయసులొనే ఆకాంక్ష మృతి చెందటం నార్త్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.

Tags: bollywood news, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news