వైసీపీ ఎంపీలు కూడా జంప్… ఈ లిస్ట్‌లో కూడా ఊహించ‌ని ట్విస్టులే…!

వైసీపీ ఎంపీలు ఏపీ రాజకీయాల్లో పెద్దగా వినబడని అంశం…ఉండటానికి 22 మంది ఎంపీలు ఉన్నారు..అటు రాజ్యసభ ఎంపీలు కూడా బాగానే ఉన్నారు. కానీ వీరు ఏం చేస్తున్నారో ప్రజలకు క్లారిటీ లేదు..అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ఏమైనా పోరాడుతున్నారా? అది కనబడదు. ఏదో మిథున్ రెడ్డి, మార్గాని భరత్, విజయసాయి రెడ్డి లాంటి వారి పేర్లు కాస్త రెగ్యులర్ గా న్యూస్ లో వినిపిస్తాయి. మిగిలిన వారి పేర్లు న్యూస్ లో కూడా రాదు. అలా అని వారు ప్రజల్లో తిరుగుతున్నట్లు కనిపించరు.

ఇక టి‌డి‌పికి ఉన్నది ముగ్గురు ఎంపీలైన వారు పార్లమెంట్ రాష్ట్రం కోసం పోరాడతారు. ఇటు ప్రజల్లో ఉంటారు. కానీ వైసీపీ ఎంపీలు ఎటు కనిపించరు. అందుకే వైసీపీ ఎంపీలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సారి వైసీపీ ఎక్కువ స్థాయిలోనే ఎంపీ సీట్లలో కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అదే సమయంలో జగన్ సైతం..కొందరు ఎంపీలకు సీట్లు ఇచ్చే పరిస్తితి లేదని తెలుస్తోంది.

ఇక వైసీపీపై మరికొందరు ఎంపీలు సైతం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఎంపీలు సైతం వైసీపీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వైసీపీకీ ఎప్పుడో దూరమయ్యారు. ఈయన ఎన్నికల ముందు టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈయన బాటలోనే కొంతమంది ఎంపీలు సైతం వైసీపీకీ షాక్ ఇచ్చి టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎలాగో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది..ఈ లోపు ఎంపీలు కూడా వైసీపీలో తట్టా బుట్ట సర్దేసుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రు సిట్టింగ్ ఎంపీల‌కు జ‌గ‌జ‌న్ ఈ సారి ఖ‌చ్చితంగా సీట్లు ఇవ్వ‌ర‌నే అంటున్నారు.

మ‌రి కొంద‌రు ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. వీరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వ‌క‌పోతే వీరు కూడా పార్టీ నుంచి జంప్ కొట్టేస్తార‌నే అంటున్నారు. ఏదేమైనా ఈ సారి సిట్టింగ్ ఎంపీల్లో జ‌గ‌న్‌కు షాకులు ఇచ్చే వారు కూడా ఉన్నార‌ని.. ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా వీళ్ల ట్విస్టులు ఉండ‌బోతున్నాయ‌ని టాక్ ?

Tags: AP, ap politics, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news, ysrcp