బ్రేకింగ్‌: మహేష్ 28 కి ఆ టైటిల్ ఫిక్స్ … సెంటిమెంట్ మార్చేసిన త్రివిక్ర‌మ్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ సినిమా SSMB 28. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7వ తేదీ నుంచి జరగనుంది. థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మహేష్ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Amaravathi Atu Itu (2024) - IMDb

ఇక గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ ఏది ఫిక్స్ అవుతుంద‌న్న చ‌ర్చే అంద‌రిలోనూ ఉంది. అటు మ‌హేష్ అభిమానుల‌తో పాటు ఇటు తెలుగు సినిమా అభిమానులు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. గ‌తంలో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి పేరు తీసుకువ‌చ్చాయి. అయితే త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్స్ అ అక్ష‌రంతో స్టార్ట్ అవ్వ‌డం గ‌త కొంత కాలంగా జ‌రుగుతోంది.

SSMB28 (2023) Full Hindi Dubbed Movie | Mahesh & Samantha | New Blockbuster  South Action Full Movie - StatusRC

మ‌రి ఇప్పుడు మహేష్ టైటిల్ విష‌యంలో ఏం చేస్తాడ‌న్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌లేదు. ఈ సినిమా కోసం మూడు నాలుగు టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, అయోధ్యలో అర్జునుడు, ఊరికి మొనగాడు వంటి టైటిల్స్‌ విపరీతంగా ప్రచారం అయ్యాయి. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా క‌థ గుంటూరు నేప‌థ్యంలో ఉండ‌డంతో గుంటూరు కారం అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Amaravathi Atu Itu (2024) - IMDb

అంటే త్రివిక్ర‌మ్ త‌న అ సెంటిమెంట్‌కు భిన్నంగా వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా క‌థ గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో జ‌ర‌గ‌నుంది. దీంతో యూనిట్ ఈ టైటిల్ వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నాయి. ఈ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ను 2024 జనవరి 13న విడుదల చేయనున్నారు.