బ్రేకింగ్‌: భ‌గ‌వంత్ కేస‌రితో పాటు బాల‌య్య 109 టైటిల్‌పై కూడా గుడ్ న్యూస్‌..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్‌లో 108వ ప్రాజెక్టులో న‌టిస్తున్నాడు. భ‌గ‌వంత్ కేస‌రి టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. బాల‌య్య బ‌ర్త్ డే కానుక‌గా రెండు రోజుల ముందే ఈ సినిమా టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే లేవు.

అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ల త‌ర్వాత బాల‌య్య చేస్తోన్న సినిమా కావ‌డం, అటు ఆరు వ‌రుస విజ‌యాల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. పైగా బాల‌య్య మార్క్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా స‌రికొత్త ర‌చ్చ లేపుతుంద‌న్న అంచ‌నాలు ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా ఉన్నాయి.

ఇక బాల‌య్య 109వ సినిమా ద‌ర్శ‌కుడు బాబీతో చేయ‌డం ఆల్‌మోస్ట్ క‌న్‌ఫార్మ్ అయ్యింది. బాబీ ఈ సంక్రాంతికి వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాబి ఏకంగా అదిరిపోయే మాస్ క‌థ‌తో బాల‌య్య‌ను డైరెక్ట్ చేస్తుండ‌డం కూడా ఆస‌క్తిక‌ర‌మే.

NBK 108 First Look Out: Nandamuri Balakrishna's Agressive Beard &  Moustached Look Hikes The Interest 'Beyond Imagination'

ఇక బాల‌య్య బ‌ర్త్ డే కానుక‌గా ఈ నెల 10నే బాల‌య్య 109వ సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని.. దీనిపై ఓ కాన్సెఫ్ట్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అలాగే భగవంత్ కేసరి నుంచి 10న మాసివ్ టీజర్ కట్ రిలీజ్ చేయబోతున్నారు.