ఆ పార్ట్‌కు స‌ర్జ‌రీ చేయించుకున్న హీరోయిన్ శిల్పాశెట్టి… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డిన టాప్ సీక్రెట్‌..!

బాలీవుడ్ సీనియ‌ర్ బ్యూటీ శిల్పాశెట్టి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ప‌రిచ‌యం ఉంది. ఆమె తెలుగులో బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న అప్ప‌ట్లో సినిమాలు చేసింది. నాగ్‌తో ఆజాద్‌, వెంకీతో సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య‌, బాల‌య్య‌తో భ‌లేవాడివి బాసు సినిమాల్లో న‌టించింది. ఆమె వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Azaad (2000) - IMDb

 

ఇదిలా ఉంటే శిల్పా శెట్టి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో త‌న బాడీలోని ఓ పార్ట్‌కు స‌ర్జ‌రీ చేయించుకున్నాన‌ని.. అందంగా క‌నిపించ‌డం కోస‌మే తాను ఇలా చేశాన‌న్న నిజం ఒప్పుకుంది. త‌న బాడీ పార్ట్‌లు అన్ని స‌రిగానే ఉన్నా త‌న వంక‌ర ముక్కు కార‌ణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది.

త‌న‌కు పుట్టుక‌తోనే న‌డ్డిముక్కు వ‌చ్చింద‌ని.. అందువ‌ల్ల స్కూల్ స్టేజ్‌లోనే తాను చాలా కామెంట్లు, ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. దీంతో ఎక్క‌డికి వెళ్లినా ఎక్కువ సేపు ముక్కు మీద వేలేసుకుని ఉండేదానిని అని చెప్పింది. తాను బాగా క‌నిపించాల‌ని కోరుకునే దానిని నిజ‌మే అని.. దానికోస‌మే నా ముక్కును స‌రి చేసుకున్నా అని.. తాను మ‌రీ అందాల సుంద‌రిగా క‌నిపించేందుకు ట్రై చేయ‌లేద‌ని… జ‌స్ట్ చూడ‌డానికి బాగుంటే చాల‌ని అనుకున్న‌ట్టు కూడా శిల్పా చెప్పింది.

Sahasa Veerudu Sagara Kanya Telugu Full Movie || Venkatesh Movies - YouTube

ఇక శిల్పా అభిమానులు మాత్రం త‌మ అభిమాన హీరోయిన్ ముక్కు సీక్రెట్ ఇదా.. మొత్తానికి ఇన్నాళ్ల‌కు ఆ ర‌హ‌స్యం బ‌య‌ట ప‌డింద‌ని కామెంట్లు పెడుతున్నారు.