కావ్య వాళ్ళ తాతయ్య ఇంకా నువ్వు ఏంటమ్మా మీ పుట్టింటికి వెళ్ళలేదు అని అడుగుతాడు. మీ మనవడే వద్దన్నాడు తాతయ్య అంటుంది కావ్య. ఎందుకు వద్దన్నావ్ రాజ్ అని అడిగితే ఈరోజు మంచి ముహూర్తం కాదు అంట తాతయ్య అందుకే వద్దన్నాను అంటాడు. ఎవరు నీకు చెప్పిన పంతులు ఒకసారి ఫోన్ చెయ్ ఈరోజు చాలా మంచి రోజు అంటాడు రాజ్‌వాళ్ళ తాతయ్య.
ఇంతలో రాజ్ కావ్యాన్ని రూమ్ లోకి లాక్కెళ్ళిపోతాడు. రాజ్ కాంట్రాక్టర్ శ్రీనుకి ఫోన్ చేసి ఆ కాంట్రాక్ట్ కనకం వాళ్ళకి తిరిగి ఇచ్చేయ్ మని చెబుతాడు. శ్రీను సరే సర్ ఇప్పుడే వెళ్తున్నాను అంటాడు. స్వప్న రాహుల్ దగ్గరికి వెళ్లి రాజ్ ని చూసి నేర్చుకో మా చెల్లెలికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు నువ్వు ఉన్నావు ఎందుకు అంటుంది.
రాజ్ నేను అన్ని మంచి పనులు ఎప్పుడు చేశాను అని మనసులో అనుకుంటాడు. రాజ్ తన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ కావ్య పడిపోయినట్టు కలగంటాడు. రాజ్ అంతరాత్మ ఇంకా నువ్వు నూనె పోయలేదు రా ముందు వెళ్లి నూనె పోయి అంటాడు. కళ్యాణ్ అప్పు కలుస్తారు.. ఫోన్ నెంబర్ అడిగితే ఇస్తే ఇస్తానని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి ఇదేంట్రా అంటూ అప్పు కోప్పడుతుంది. కావ్య నూనె చూసి దానిమీద కాలు వేయకుండా దాటుతుంది.
ఏం ప్రయత్నాలు చేస్తున్నారు భార్య నూనె మీద కాలేసి కింద పడిపోతే వాళ్ళ పుట్టింటికెళ్లడం ఆపేస్తుందేమోనని చాలా ప్రయత్నాలు చేస్తున్నారుగా అని రాజుని అంటుంది కావ్య. రాజ్ కావ్యాన్ని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళతాడు. కావ్య వెంటపడుతూ ఏవండీ ఉప్మా తినండి అంటుంది. నేను తినను అంటాడు రాజ్. ఇంతలో మట్టిలో కాలేస్తాడు రాజ్. రాజ్ కావ్య మట్టి తొక్కుతారు దానిని వీడియో తీసి రుద్రాణి అపర్ణాకు చూపిస్తుంది. అపర్ణ కోపంగా ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయింది.