నా భార్యతో విడిపోవడం లేదు.. దయచేసి పుకార్లు ఆపండి..స్టార్ క్రికెటర్ రిక్వెస్ట్..!

యజేంద్ర చాహల్ టీమిండియా జట్టులో మంచి స్పిన్నర్ గా పేరుతెచ్చుకున్నాడు. అతడు రెండేళ్ల కిందట కొరియోగ్రాఫర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది. చాహల్ మ్యాచ్ లకు కూడా ధనశ్రీ హాజరు అవుతూ ఉంటుంది. చాహల్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే కొద్ది రోజులుగా ఈ జంట విడిపోతుందని సోషల్ మీడియా వేదికగా పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లు అంతటికి కారణం టీమిండియా మరో బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్. గత వారం క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ చాహల్ లేకుండానే అయ్యర్ తో కలిసి హాజరయ్యింది. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో అయ్యర్ తో ధనశ్రీ సన్నిహితంగా మెలిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తనకు కొత్త జీవితం మొదలవుతోందని సోషల్ మీడియాలో చాహల్ రాసుకొచ్చాడు. ముందు అతడు తండ్రి అవుతున్నాడు ఏమోనని అంతా భావించారు. ఆ తర్వాత కాసేపటికి ధన శ్రీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ధన శ్రీ పక్కన చాహల్ అని ఉన్న సర్ నేమ్ ని తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారని పుకార్లు రావడం మొదలైంది.

కొద్ది రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ అటు చాహల్ గానీ ఇటు ధనశ్రీ గాని దీనిపై స్పందించలేదు. ఖండించలేదు. దీంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. ఇక పరిస్థితి చేయి దాటి పోతుండడంతో చాహల్ స్పందించాడు. ‘అందరికీ విజ్ఞప్తి. ధనశ్రీ తో నా బంధానికి సంబంధించి వస్తున్న పుకార్లను దయచేసి నమ్మొద్దు. వాటిని ఇంతటితో ఆపేయండి’ అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా చాహల్ విజ్ఞప్తి చేశాడు. చాహల్ విజ్ఞప్తి తో అయిన ఈ పుకార్లకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.

Tags: chahal wife dhanasree verma, cricketer yuzvendra chahal, yuzvendra chahal divorce