చిరుపై నటుడు షాకింగ్ కామెంట్స్.. వారి వల్లే మెగాస్టార్ తో వైరం..

తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గౌరవం ఉంది. సామాన్య జనం నుంచి సినీ పరిశ్రమ వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఆయన్ను విమర్శించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే నటుడు కాదంబరి కిరణ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి, ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అంటే అందరికిీ చిరాకు వచ్చిందని కాదంబరి కిరణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో తాను రాజేంద్ర ప్రసాద్ కి, అలాగే పరిశ్రమలో ఉన్న కొంత మంది పెద్దలకు మద్దతు ఇచ్చానని అన్నారు. దీంతో ఇండస్ట్రీలో తనకు చెడ్డ పేరు వచ్చిందని తెలిపారు. శివాజీరాజాకు తనకు మధ్య గ్యాప్ ఉండాలని, దూరం ఉంటేనే ఇద్దరికీ మంచిదని కాదంబరి కిరణ్ అన్నారు. తనను అవమానించే హక్కు ఎవరికీ లేదన్నారు..

తనకు అక్కినేని నాగార్జునకు మంచి అనుబంధం ఉందని కాదంబరి కిరణ్ అన్నారు. నాగార్జునకు పల్లెటూరి టైటిల్స్ అంటే చాలా ఇష్టమన్నారు. ఇండస్ట్రీలో నాగార్జునను చినబాబు అని పిలుస్తారని తెలిపారు. నాగార్జునతో బావ అనే సినిమా తీయాలని అనుకున్నానని, ఆయనకు కథ కూడా వినిపించానని అన్నారు. ఇన్నేళ్లు గడిచినా అది పూర్తి కావడం లేదన్నారు. ఆయన క్రేజ్ రోజురోజుకు పెరిగిపోవడంతో బావ మూవీ మధ్యలోనే ఆగిపోయిందన్నారు..

అయితే తాను చిరంజీవి సినిమాల్లో మాత్రం నటించలేకపోయానని అన్నారు. చిరంజివి గారిని తాను ఎంతో ఆరాధిస్తానని అన్నారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు, దూరం లేదని అన్నారు. కానీ చిరంజీవితో ఉన్న కొంత మంది వల్ల తనను దూరంగా ఉండాల్సి వచ్చిందని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. ఇక హీరోయిన్లలో రమ్యకృష్ణ వ్యక్తిత్వం చాలా మంచిదని, నన్ను ఆమె ఎంతగానో గౌరవిస్తారని కాదంబరి కిరణ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Tags: chiranjeevi, comments, Fight, highlight, Kiran, latest news, Tollywood, viral