ప్రస్తుత రోజుల్లో చిన్న ,పెద్ద అంతా బిర్యాని రోజు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయను కూడా కలుపుకుని తింటారు. రెస్టారెంట్లో బిర్యానీలోకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఉల్లిపాయ మాత్రం కంపల్సరిగా ఇస్తారు. బిర్యానీలో ఉల్లిపై లేకపోతే రచ్చ రచ్చ చేస్తారు జనం. ఎందుకంటే బిర్యానీలో ఉల్లిపాయ టచ్‌కి అంత అలవాటు పడిపోయారు. కానీ అలా తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదట. ఏదైనా మితంగా తింటే ఏం కాదు కానీ, అధికంగా తింటే పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
• పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. కాబట్టి ఇది ప్రేగులపై ప్రభావం చూపిస్తుంది.
• అలాగే పచ్చి ఉల్లిపాయని ఎక్కువగా తీసుకుంటే కడుపులో నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
• దీనివల్ల నోటి దుర్వాసనతో పాటుగా ఎసిడిటీ సమస్య ఎదురవుతుంది.
• ముఖ్యంగా గర్భిణులు పచ్చి ఉల్లిపాయని తింటే వాంతులు, గుండెలో మంట, వచ్చే అవకాశం ఉంది.
• ఇందులో ఉండే పొటాషియం లివర్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
• కొంతమందిలో మలబద్ధకం కూడా వస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి