70 ఏళ్ల వయసున్న చంద్రబాబు ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నారు. తెలుగు రాజకీయాలను ప్రస్తావిస్తూ అందులో..ఆ చరిత్ర పుటల్లో చంద్రబాబుకు ఎప్పుడూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఐదేళ్లు ముఖ్యమంత్రిగాను.. ఇటు నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు.
చంద్రబాబు పాలనలో ఎంత దార్శనికుడో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఏపీలో 50 ఏళ్ల వయసున్న జగన్ సీఎంగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతల్లో ఎవరు ? యాక్టివ్‌గా ఉన్నారు ? ఎవరు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు? ఎవరు ఫ్యూచర్ కోసం.. ఆలోచన చేస్తున్నారు ? ఎవరు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు ? ఎవరు రాష్ట్రం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నారన్న ప్రశ్నలకు రాష్ట్ర జనాలు చెపుతోన్న ఏకైక ఆన్సర్ చంద్రబాబు.
ఈ విషయంలో మరో ఆన్సర్‌కు అస్సలు తావులేదనే వారు చెపుతున్నారు. యంగ్ సీఎంగా ఉన్న జగన్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపే స్కోప్ ఉన్నా కూడా అసలు తాడేపల్లి క్యాంప్ దాటి బయటకు కదలడం లేదన్న విమర్శలే ఎక్కువుగా ఉన్నాయి. జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దాటి బయటకు రాని పరిస్థితి.. వచ్చినా జనాల మధ్యలో పరదాలు కట్టుకుని వెళ్లడం ఏంటన్న విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి.
చంద్రబాబు సీఎంగా ఉండగా విశాఖకు 19 సార్లు వచ్చారు. పైగా హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు నగరంలోనే ఐదారు రోజులు ఉండి పరిస్థితిని సమీక్షించి కేవలం 24 గంటల్లో కరెంటు వచ్చేలా చేశారు. అన్ని జిల్లాల్లోనూ కాళ్లకు బలపం కట్టుకుని మరీ తిరిగారు. పోలవరం విషయంలో ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని అక్కడ పనులు సమీక్షించారు. ఆయన ఏకంగా 43 సార్లు ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శించారు.
అమరావతి నిర్మాణాల కోసం.. సింగపూర్,. దుబాయ్ వెళ్లి అమరావతిని భవిష్యత్తులో మరో 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా నిర్మించాలని కలలు కనడంతో పాటు చాలా వరకు వాటిని సాకారం చేసే దిశగా పని చేశారు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం ఇవేవి పట్టకుండా ఇంటికే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఏదేమైనా 70 ల్లో చంద్రబాబు ఉరుకులు పరుగులు పెడుతుంటే… 50ల్లో ఉన్న జగన్ హాయిగా ఇంట్లో రిలాక్స్ అవుతున్నట్టుగా పాలన చేస్తున్నారన్న కంపేరిజన్లు అయితే ఉండనే ఉన్నాయి.