Ashu Reddy : అషు రెడ్డికి 70 లక్షల కారు గిఫ్ట్.. ఎవరు ఇచ్చారంటే..!

Ashu Reddy : బిగ్ బాస్ వల్ల సూపర్ పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. ఆమె ఏం చేసినా సరే సోషల్ మీడియాలో హంగామా షురూ అవుతుంది. తన ఇన్ స్టాగ్రాం లో హాట్ హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని అలరించే అషు రెడ్డి ఓ ఖరీదైన కారుని గిఫ్ట్ గా పొందింది. ఇంతకీ ఆ కార్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అంటే ఆమె తండ్రి అని తెలుస్తుంది. అషు రెడ్డికి 70 లక్షల బెంజ్ కారుని తన బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు అషు రెడ్డి ఫాదర్.

అషు రెడ్డి తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూసి సర్ ప్రైజ్ అయింది. అంతేకాదు కారు పక్కన తన తండ్రితో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న అషు రెడ్డి సినిమా హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే ఎందుకో దాని మీద ఫోకస్ పెట్టట్లేదు.

బిగ్ బాస్ 3 ఇంకా బిగ్ బాస్ నాన్ స్టాప్ లలో ప్రేక్షకులని అలరించిన Ashu Reddy తన సోషల్ మీడియా క్రేజ్ తోనే కెరియర్ వెళ్లదీస్తుంది. ఆమధ్య కొన్ని రియాలిటీ షోస్ చేసిన అషు రెడ్డి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఎప్పుడు ముందుంటుంది. బిగ్ బాస్ వల్ల బీభత్సమైన ఫాలోయింగ్ పెంచుకున్న అషు రెడ్డి ఆ క్రేజ్ ని ఏమాత్రం తగ్గకుండా తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

Tags: Ashu Reddy, Ashu Reddy New Car, BiggBoss Ashu Reddy, BiggBoss Ashu Reddy News