BiggBoss 6 : సీజన్ ఏదైనా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటే రగడ మొదలైనట్టే. సీజన్ 6 లో నాల్గవ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది. ఆల్రెడీ హోస్ట్ నాగార్జున డైరెక్ట్ గా ఇద్దరిని నామినేట్ చేశాడు. అర్జున్ కళ్యాణ్, కీర్తిలను నాగార్జున నామినేట్ చేయగా మిగిలిన వారిలో కెప్టెన్ ఆది రెడ్డి తప్ప మిగతా వారిని నామినేట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో హౌస్ మెట్స్ అంతా ఆట సరిగా ఆడని వారిని.. తమతో సరిగా ప్రవర్తించని వారిని నామినేట్ చేశారు.
లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో గొడవ పడ్డ శ్రీహాన్, ఇనయా మళ్లీ నామినేషన్స్ లో అదే పాయింట్ తీసి గొడవకి దిగారు. ఇక మరోపక్క హౌస్ మెంట్స్ అంతా కలిసి ఎనిమిది మందిని నామినేట్ చేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 6 లో నాల్గవ వారం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో ఈ వారం ఎవరికి రిస్క్ ఉంది అని ఎనాలసిస్ చేస్తే.. ఆరోహి, అర్జున్ కళ్యాణ్, సుదీపా, రాజ శేఖర్ ఈ నలుగురిలోనే ఒకరు హౌస్ కి గుడ్ బై చెప్పొచ్చని టాక్.
ఈ లిస్ట్ లో ఇనయా కూడా ఉండాల్సింది కానీ నామినేషన్స్ లో మేజర్ గా అందరు ఇనయాని టార్గెట్ చేయడంతో ఆడియన్స్ లో ఆమెపై సింపతీ ఏర్పడింది. అందుకే ఓటింగ్ లో టాప్ లో రేవంత్ ఉండగా సెకండ్, థర్డ్ పొజిషన్ లో గీతు, ఇనయా ఉన్నారు. ఇనయాకి ఈ రేంజ్ ఓటింగ్ అసలు ఊహించలేదని చెప్పొచ్చు.