ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీకి భారీ షాక్‌… ఒకేసారి టీడీపీలో చేరిన 2 వేల మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు..!

ఏపీలో అధికార వైసీపీకి కంచుకోట ఆయన నంద్యాల జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లతో పాటు కర్నూలు నంద్యాల రెండు లోక్‌స‌భ సీట్లను వైసిపి భారీ మెజార్టీలతో కైవసం చేసుకుంది. ఇక నంద్యాల – ఆళ్లగడ్డ లాంటి నియోజకవర్గాల్లో కూడా వైసిపికి భారీ మెజార్టీలు వచ్చాయి.

అయితే ఆళ్లగడ్డలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ కోలుకోలేనంత పెద్ద షాక్ తగిలింది. టిడిపిలోకి కీలక నేతతో సహా ఏకంగా వైసిపి కి చెందిన 2000 మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. ఒకేసారి అంతమంది వైసీపీ కార్యకర్తలు వైసిపిని వీడి వెళ్ళటం అంటే పెద్ద షాక్ అని చెప్పాలి. హైకోర్టు ప్రముఖ న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు తో పాటు రెండు వేల మంది వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

ఇది నిజంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పెద్ద షాక్ అనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుంచి టిడిపికి చెందిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సమీకరణాల నేపథ్యంలో భూమా కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇస్తారా ? ఇవ్వరా అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గా ఉంది. ఏది ఏమైనా వైసీపీ కంచుకోట నుంచే మార్పు మొదలైంది అనేందుకు ఇదే పెద్ద ఉదాహరణగా నిలవనుంది.