టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా భోళా శంకర్ . మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. కేవలం మెహర్ రమేష్ కి కాదు హీరోయిన్ తమన్నాకు – కీర్తి సురేష్ కు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా చాలా ప్రధానమని సినిమా రిలీజ్ అయ్యే ముందే చెప్పుకొచ్చారు సినీ విశ్లేషకులు .
అయితే భరైఇ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం బిగ్ డిజాస్టర్ టాక్ ని నమోదు చేసుకుంది . కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ను సొంతం చేసుకునింది. దానికి మెయిన్ రీజన్ సినిమా కథ . అసలు కథ కంటెంట్ ఏం బాగోలేదు అనే టాక్ వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా పాత చింతకాయ పచ్చడి చూపించాడని ..అది జనాలకు అస్సలు నచ్చలేదని చెప్పుకొస్తున్నారు .
అంతేకాదు సినిమాలో నలుగురు గ్లామరస్ బ్యూటీలు ఉన్నా సరే గ్లామర్ ని దట్టించడంలో మెహర్ రమేష్ ఫ్లాప్ అయ్యారు. అసలు తమన్నా పాత్ర చిరంజీవి పక్కన ట్రావెల్ అయింది చాలా తక్కువ . సినిమా మొత్తం చిరంజీవి – కీర్తి సురేష్ నడుస్తూ ఉంటారు. కీర్తి సురేష్ చెల్లెలు కావడంతో ఎక్కడ ఎక్స్పోజింగ్ కి గ్లామర్ కి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. ఇక కీర్తి సురేష్ ఫ్రెండ్ గా శ్రీముఖి బాగా మెప్పించింది . రష్మి సైతం రెండు సీన్స్ లో ఒక హాట్ సాంగ్స్ లో మెరిసింది .
అయితే ఇద్దరుకూడా వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు . అంతే కాదు సినిమాకి మ్యూజిక్ కూడా డిజాస్టర్ అయింది . ఎక్కడ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ కి హై లెట్ చేయలేకపోయింది .అంతేకాదు మరీ ముఖ్యంగా సినిమాలో ఆ సీన్ కి సంబంధించిన డైలాగు వచ్చే ముందే జనాలు గెస్ చేసి మరి ఆ డైలాగులు చెప్పేస్తున్నారంటే.. సినిమాలో ఎంత ప్రిడిక్టెడ్ సీన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు .అంతే కాదు చిరంజీవి రేంజ్ కి తగ్గ కథ కాదు ఇది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే హీరో లేకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ పండించాలి అనుకున్న హీరో చేస్తే బాగుండేది అని .. చిరంజీవి సినిమాను యాక్సెప్ట్ చేసి తప్పు చేశాడని చెప్పుకొస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం చూద్దాం అని భూతద్దంలో పెట్టి చూసిన ఎక్కడా కనిపించే స్కోప్ అయితే ఉండదు. అందుకే 0.5 రేటింగ్ ఇస్తున్నారు జనాలు. మెగాస్టార్ ఖాతాలో మరో ఆచార్య సినిమా పడింది అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు రిజల్ట్ ఈ విధంగా ఉంటే కలెక్షన్స్ ఇంకా ఏ విధంగా ఉంటాయో అంటూ మెగా ఫాన్స్ లభోదిభో అంటున్నారు..!!