ఓ షట్ డామిట్.. చిరంజీవిని అడ్డంగా ఇరికించేసిన కీర్తి సురేష్.. పెద్ద తలనొప్పే వచ్చి పడిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు . భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి . ఈ క్రమంలోనే ఎటువంటి ఎక్ష్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు పాజిటివ్ టాక్ అందుకోవడమే కాకుండా పెట్టిన దానికి పది రెట్లు లాభాలు తీసుకొస్తున్నాయి. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అర్థం కాకుండా పోయింది . అందుకే సినిమాను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఆలోచించి నిర్ణయించుకొని సినిమా విషయంలో ముందుకు అడుగులు వేస్తున్నారు .

Bhola Shankar: చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న భోళా శంక‌ర్ సినిమా టాప్  10 ఆసక్తికరమైన విశేషాలివే !

కాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “భోళాశంకర్”. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూలు పూర్తయ్యాయి . 80% షూటింగ్ కంప్లీట్ అయింది . అయితే ఇంకా సినిమాకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెన్స్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించలేకపోతున్నాడు మెహర్ రమేష్. దానికి కారణం కీర్తి సురేష్ కాల్ షీట్సే. చిరంజీవి కాల్ షీట్స్ కీ ఆమె టైం మ్యాచ్ అవ్వట్లేదట .

చిరు భోళా శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ అతడేనా | Bhola Shankar Movie Music  Director Latest Update,Chiranjeevi, Acharya, Vedalam Movie Remake, Keerthy  Suresh, Bhola Shankar Movie,Swara Sagar Mahathi, Meher Ramesh Movie ...

ఈ క్రమంలోనే ఇద్దరు కాంబోలో రావాల్సిన సీన్స్ లేటవుతున్నాయి అంటూ తెలుస్తుంది. అయితే కీర్తి సురేష్ మాత్రం ఈ టైంలో కాల్ షీట్స్ ఇవ్వలేను అంటూ హ్యాండ్ ఇచ్చేసిందట . కోలీవుడ్లో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు భోళా శంకర్ సినిమాకి సమయం కేటాయించలేని అంటూ ఓపెన్ గా చెప్పేస్తుందట . ఈ క్రమంలోని కీర్తి సురేష్ పై చిత్రీకరించాల్సిన సీన్స్ పెండింగ్లో ఉండిపోయాయి .

కాగా చిరంజీవి సైతం ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకుని మరో సినిమా షూట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు . ఇలాంటి టైం లోనే కీర్తి సురేష్ కొత్త హెడేక్ గా మారిపోయింది . చూడాలి మరి మెహర్ రమేష్ ఈ కాల్ షీట్స్ ని ఎలా మేనేజ్ చేస్తాడో.. తెరపై కీర్తి సురేష్ – చిరంజీవిల ఎమోషన్స్ ఏ విధంగా చూపిస్తాడో..?