శివరాత్రి కానుకగా తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీష్మ పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతున్నది. చాలా కాలం తరువాత నితిన్‌కు బ్రేక్ ఇచ్చేలా కనబడుతున్నది. సితార ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు చలో ఫేమ్ వెంకి కుడుముల దర్శకత్వం వహించగా, నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న నటించింది. వెన్నెల కిషోర్, బ్రహ్మజీ తదితర తెలుగు ప్రముఖ తారాగాణం కీలక పాత్రలను పోషించడమేగాక, చక్కని వినోదంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టిందని టాలివుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నట్లేనని వివరిస్తున్నారు సినీ పండితులు.
ఇదిలా ఉండగా ఈ చిత్రం మొదటిరోజునే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో భీష్మ మొదటిరోజు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుందని సమాచారం. తెలంగాణ ఏరియాలో రూ.2.21 కోట్ల గ్రాస్‌ను షేర్ను రాబట్టిందని తెలుస్తున్నది. ఇది నితిన్ కేరీర్‌లో రెండో బెస్ట్ అని టాలివుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంతకు ముందు నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అ ఆ..2.30 కోట్లతో అతని కెరీర్ బెస్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజున భీష్మ దాదాపు రూ.5.5 కోట్ల నుంచి ఆరు కోట్ల మధ్య గ్రాస్‌ను షేర్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు మరే చిత్రం పోటీలో లేకపోవడంతో దాదాపు థియేటర్లన్నీ భీష్మతోనే నిండిపోయాయి. ఇలాగే కొనసాగితే మరింత పెద్ద మొత్తంలో గ్రాస్‌ను షేర్ అవకాశముందని అంచనా వేస్తున్నారు.