యువనేత.. మ‌హామేత.. జ‌గ‌న్‌పై లోకేష్ సెటైర్లు

కేబినెట్ స‌బ్‌క‌మిటీ అందించిన నివేదిక ఆధారంగా టీడీపీ ప్ర‌భుత్వ ఐదేళ్ల కాలంలో జ‌రిగిన చేపట్టిన ప్రాజెక్టులు.. రాజ‌ధాని అమ‌రావ‌తి భూముల సేక‌ర‌ణ‌, కీల‌క నిర్ణ‌యాల‌ను విచారించేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భ్త‌వం ఏకంగా ప్ర‌త్యేక బృందాన్ని నియ‌మించింది. మాములుగా కాకుండా ఎవ‌రినైనా విచార‌ణ‌కు పిలిచే. అరెస్టు చేసే అధికారాల‌ను సైతం దానికి క‌ట్ట‌బెట్టింది. డీఐజీ కొల్లి రాఘురామ‌రెడ్డి నేతృత్వంలో కొన‌సాగే ఈ బృందానికి అన్ని శాఖ‌ల అధికారులు స‌హ‌క‌రించాల‌ని, అస‌ర‌మైన రికార్డుల‌ను సైతం అంద‌జేయాల‌ని ఆదేశిస్తూ జీవోను జారీ చేసింది. ఇప్ప‌టికే ఈ అంశం రాజ‌కీయా వ‌ర్గాల్లో దుమారం రేపుతున్న‌ది. తెలుగు రాష్ర్టాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై తెలుగు త‌మ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌నేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం జ‌గ‌న్‌పై వ్యంగ్యాస్ర్తాల‌ను సంధించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి హయాంలోనూ ఇలాగే ఎన్నో విచారణలు జరిపారని,, అయినా సాధించింది ఏమీ లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికారంలోకి వ‌చ్చిన తొమ్మిది నెలలుగా సబ్ కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణల పేరుతో జ‌గ‌న్ హడావడి చేస్తున్నారే త‌ప్ప సాధించింది ఏమీ లేద‌ని, తాజాగా ఏర్పాటు చేసిన ఈ సిట్ కూడా అంతేనని ఎద్దేవా చేశారు.
అంతేగాక ‘మహామేత అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. ఏమైంది? అంటూ ప్ర‌శ్నించారు. ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు.. అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతో .. ఇక్కడే అర్ధం అవుతుంది యువమేత ఆత్రం.. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమేన‌ని జ‌గ‌న్‌పై సెటైర్లు వేశారు నారా లోకేష్. వాటితో వాటు గ‌తంలో పలు క్లిప్పింగుల‌ను పోస్టు చేశాడు ఈ మాజీ మంత్రి. ప్ర‌స్తుతం అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది. తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

Tags: cm jagan, SIT, TDP EX MINISTER NARA LOKESH, twitter