నితిన్ ‘ భీష్మ ‘ రివ్యూ …

చ‌లో ఫేమ్ ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో.. నితిన్‌, ర‌ష్మీక మంద‌న్న జోడిగా న‌టించిన భీష్మ సినిమా శుక్ర‌వారం భారీ అంచ‌నాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌గా. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తీ స్వ‌ర‌సాగ‌ర్ బాణీల‌ను స‌మ‌కూర్చాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? హీరో నితిన్‌కు విజ‌యాన్ని అందించిన‌ట్లేనా? సినీ అభిమానుల అంచ‌నాల‌ను చేరుకున్న‌దా? స సినిమా క‌థ ఏమిటీ? క‌త్త‌గా ఏమి చెప్పారు? క‌థ‌నం ఎలా ఉంది? సినీ పండితుల అభిప్రాయం ఏమిటీ? అన్న‌ది ఆస‌క్తి ఉంది. అయితే సినిమా క‌థ రోటీన్ అయినా క‌థ‌నం, దానిని న‌డిపించిన తీరు కొత్త‌గా ఉంద‌నే టాక్ మాత్రం వినిపిస్తున్న‌ది. వినోదం ప్ర‌ధాన ఇరుసుగా చిత్రాన్ని తీశార‌ని తెలుస్తున్న‌ది. అదే చిత్రానికి హైల‌ట్‌గా నిలుస్తున్న‌ద‌ని అభిమానుల టాక్‌. మొత్తంమీద, భీష్మా అనేది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనే చ‌ర్చ మొద‌లైంది.

కథ :భీష్మ పేరిట ఆర్గానిక్స్ కంపెనీని ఏర్పాటు చేసి అందులో సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తుంటాడు భీష్మ (ఆనంత్ నాగ్). ఆయన వయసు 70 ఏళ్లు దాటడంతో ఆ త‌రువాత కంపెనీకి సీఈవో ఎవరనే చ‌ర్చ మొదలవుతుంది. అప్పుడే ఊహించ‌ని రీతిలో తెర‌మీద‌కు వస్తాడు భీష్మ (నితిన్). డిగ్రీ ఫెయిల్ అయి తన లవ్ సెట్ చేసుకోవాలని చైత్ర (రష్మిక మందన్న) వెంట పడుతుంటాడు. అదే సమయంలో ఉన్నట్లుండి ఓ రోజు పెద్దాయన భీష్మను సీఈవోగా ప్రకటిస్తాడు. 30 రోజులు టెస్ట్ పెడతాడు. ఇదిలా ఉండ‌గా.. మరోవైపు భీష్మ ఆర్గానిక్స్ కంపెనీని నాశనం చేయడానికి మరో కార్పోరేట్ విలన్ రాఘవన్ (జిష్షు) వ్యూహాలు ప‌న్నుతుంటాడు. వాటిని నుంచి కంపెనీని ఎలా ర‌క్షిస్తాడు.? తన ప్రేమ‌ను ఎలా దక్కించుకుంటాడు అన్న‌దే కథ.

కథనం: ఈ క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల ఓ మేర‌కు స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్ప‌వ‌చ్చు. కథాంశం చిన్న‌దే. అందులోనే రోటిన్ అంశ‌మే. అయినా దానిని మ‌ల‌చ‌డంలో అత‌ను చూపిన ప్ర‌తిభ ప్రేక్ష‌కుడి క‌ళ్ల‌కు క‌డుతుంది. సినిమాను చూస్తున్నంత సేపు స‌గ‌టు ప్రేక్ష‌కుడు విహారయాత్ర కు వెళ్లిన అనుభూతిని పొందుతాడు. క‌థ‌కు వినోదాన్ని మేళ‌వించి అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఫ‌స్టాఫ్‌లో ఎంత‌గా ఎంజాయ్ చేస్తారో ప్రేక్ష‌కులు సెకాండాఫ్‌లోనూ అంతే ఉల్లాత్సాన్ని పొందుతాడు. క‌థను ఒక‌వైపు చెప్తూను అంత‌ర్లీనంగా ఆ బిగువును ఎక్క‌డా కోల్పోకుండా వినోదాన్ని పండించాడు వెంకి. అందులో వినోదం పంచ‌డ‌మే గాక చ‌క్క‌టి సందేశాన్ని కూడా ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి అంశాన్ని చాలా చ‌క్క‌గా హ్యండిల్ చేయ‌గ‌లిగాడు.

న‌టీన‌టుల అభిన‌యం: చిత్రంలో లీడ్ రోల్‌ను పోషించిన నితిన్ చ‌క్క‌గా త‌న పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఒక‌వైపు కంపెనీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌పెట్టే వేళ ఆ పాత్ర‌కు త‌గిన‌ట్ట‌గా ప‌రిణ‌తిని ప్ర‌ద‌ర్శించాడు. మ‌రోవైపు అమ్మాయిని ఆక‌ట్టుకునే వేళ కుర్ర‌కారులా నితిన్ మంచి ఈజ్‌తో నటించాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా కామెడీ కూడా చాలా బాగా చేశాడు. ఇక రష్మిక మందన్న మరోసారి ఆకట్టుకుంది. గీత గోవిందం తరహాలో హీరోను డామినేట్ చేసే పాత్రలో మ‌రోసారి ఒదిగిపోయింది. వెన్నెల కిశోర్, బ్ర‌హ్మ‌జీ కామెడీ సీన్లు సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని చెప్ప‌డంలో అతిశ‌క్తేమీ లేదు. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపులు చెక్కలు చేస్తారు. అశ్వథ్థామ విలన్ పాత్ర‌లో జిస్సు సేన్ గుప్తా పూర్తిగా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. గంభీర్యంతో పాటు, మంచి నటన కనబర్చాడు. హెబా పటేల్ ఒక చిన్న పాత్ర అయినే ఫ‌ర్వాలేద‌నిపించింది.

సాంకేతిక సిబ్బంది ప‌ని తీరు..
మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మహతి స్వ‌ర‌సాగ‌ర్ సినిమాకు అందించిన బాణిలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. బ్యూటి సాంగ్ తెర‌మీద మ‌రింత ఆక‌ట్టుకుంటుంది. మిగ‌తా పాటలు అంత‌గా ఆకట్టుకోకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చుతుంది. చాలా సన్నివేశాలు అతడి కెమెరా వర్క్‌తో హైలైట్ అయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా అద్యంతం సినిమా నిర్మాణ సంస్థ విలువల‌ను అద్దం ప‌డ‌తాయి.

ఒక్క మాట‌లో చెప్పాలంటే.. భీష్మ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. వినోద‌మే ప్ర‌ధాన ఇరుస‌గా నిర్మించిన సందేశాత్మ‌క చిత్రం.

రేటింగ్ : 3/5

Tags: Bheeshma Movie, nithin, Rashmika, riview, venky kudumula, Vennela Kishore