‘నేను స్టూడెంట్‌ సర్” రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే..!

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించింది.

Nenu Student Sir - Official Teaser | Telugu Movie News - Times of India

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. ఈ రోజు నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే పలుచోట్ల ఫస్ట్ షో పూర్తి చేసుకున్న ఈ సినిమా చూసిన సినిమా సినీ అభిమానులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించిందో ఒకసారి చూద్దాం.

Bellamkonda Ganesh's 'Nenu Student Sir' Movie Twitter Review

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని.. అంతే కాకుండా మరికొందరు సినిమా కూడా ఎంతో ధ్రిలింగా అనిపించిందని ట్విట్ చేశారు. హీరోగా బెల్లంకొండ గణేష్ నటన కూడా బాగుందని.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా సెట్ అయ్యాయని మరికొందరు అంటున్నారు.. మరి కొంతమంది ఈ సినిమా ఫుల్ ఎమోషనల్ డ్రామా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.. ఈ సినిమాఎలాగుందో తెలియాలంటే మరి కొంతసేపు ఆగాల్సిందే..!!