ఓరి దేవుడోయ్.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ పెళ్ళి వెనుక ఇంత తతంగం నడిచిందా..? అమ్మాయి ఫేస్ అందుకే చూయించలేదా..?

ప్రస్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు బుల్లితెరపై కూడా చాలామంది నటీనటులు కమెడియన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటూ ఒకటవుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన కెవ్వు కార్తీక్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా కార్తీక్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో చెప్పుకోవచ్చాడు.

article_image1

ఇక తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇంతకీ కార్తీక్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆమె ఫేస్ ను కనిపించకుండా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తీక్. అసలు ఆమె పేరు ఏమిటి..? ఆమె ఎలా ఉంటుందో తెలియకూడదని జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అయితే ఆమె అందరికీ తెలిసిన అమ్మాయి కాదు కదా..? అంటూ మరికొందరు ఆ పోస్ట్ కి కామెంట్లు చేస్తున్నారు.

article_image3

ఇక ఇప్పుడు కార్తీక్ కెరియర్ విషయానికొస్తే మిమిక్రీ ఆర్టిస్ట్ గా హైదరాబాదులో అడుగుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశాలు అందుకొని ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఓ సాధారణ కంటెస్టెంట్ నుంచి టీం లీడర్ వరకు తన కెరీర్ లో ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. వరంగల్ ప్రాంతానికి చెందిన కార్తిక్ అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాడు.

article_image5

ఇక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా తక్కువ పేమెంట్స్ కే పని చేసి.. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకొని 2016లో అమెరికా వెళ్లి ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్ వంటి దేశాలు తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లోనే కొనసాగుతున్నాడు. ఈయన తన పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురుకున్నట్లు తెలుస్తుంది. ఇతగాడిది ప్రేమ వివాహం అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్. చూడాలి మరి ఆ అమ్మాయి ముఖం ఎప్పుడు చూపిస్తాడో..?