బాల‌య్య‌తో బ‌లగం వేణు సినిమా.. బంప‌ర్ ఆఫ‌ర్ వెన‌క ఏం జ‌రుగుతోంది…!

బుల్లితెరపై వ‌స్తున్న‌ జబర్దస్త్ కామెడీ షో తో కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వేణు. ఈ షోలో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు.. దిల్ రాజు సహాయంతో ఆయన బ్యానర్ పై మొదటగా దర్శకత్వం వహించి బలగం సినిమాను తర్కెక్కించాడు. ఆ సినిమా మంచి కథ నేపథ్యంతో ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో పాటు ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సాధించింది బలగం టీం.

ఈ సినిమాను చూసిన చిరంజీవి లాంటి ఎందరో ప్రముఖ హీరోలు వేణు పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో కోన్ని చోట్ల‌ ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మరి ఈ సినిమాను ప్రేక్షకులు అంతా వీక్షించారంటే ఏ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. డైరెక్షన్లో తన ప్రతిభను చూపించిన వేణుని చూసి అంతా ముక్కుపై వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం బలగం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న వేణు తర్వాత సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ పైనే చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు.

Balagam (2023) - Movie | Reviews, Cast & Release Date in hyderabad-  BookMyShow

అలాగే దిల్ రాజు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే వేణు తన రెండవ సినిమాను ఒక ప్రముఖ స్టార్ హీరోతో తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరి ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్యకు వేణు కథ చెప్పడం బాలయ్య చూద్దాం అని చెప్పారంటూ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

Director Venu Yeldandi Stills at Balagam Movie Interview

ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య తో సినిమా చేసే ఛాన్స్ దొరకడం అంటే వేణు కి మళ్లీ ఇంకోసారి విజయం దక్కినట్లే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు దిల్ రాజు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాట్ట‌. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఎన్ బి కే 108 సినిమాలు నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వేణు డైరెక్ట్ చేసే సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నాడని వార్తలో ఎంత నిజం ఉందో వేణు స్పందిస్తే కాని తెలియ‌దు.