బ్రేకింగ్‌: బాల‌య్య – బోయ‌పాటి ‘ అఖండ 2 ‘ సినిమాపై మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్‌… !

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్‌, అఖండ మూడు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. ఇక అఖండ సినిమా అయితే థియేట‌ర్ల‌లో పూన‌కాలు తెప్పించేసింది. బాల‌య్య కెరీర్‌కు మంచి ఊపు ఇచ్చింది.

Akhanda: Hyderabad Traffic Police Shares A Scene From Nandamuri Balakrishna  Starrer To Promote Safety

ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన వీర‌సింహారెడ్డి సినిమాలో యావ‌రేజ్ కంటెంట్ ఉన్నా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. అస‌లు బాల‌య్య‌కు ఈవ‌య‌స్సులో ఇంత క్రేజ్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా అఖండ సినిమాయే. అఖండ త‌ర్వాత అఖండ 2 ఉంటుంద‌న్న ప్ర‌క‌ట‌న‌తో బోయ‌పాటి పెద్ద షాకే ఇచ్చాడు.

బోయ‌పాటి ప్ర‌క‌ట‌న‌తో అఖండ 2 ఎప్పుడెప్పుడు ఉంటుందా ? అన్న ఒక్క‌టే ఉత్కంఠ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం బాల‌య్య అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అటు బోయ‌పాటి రామ్ పోతినేని తో ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Akhanda2 - Nandamuri Balakrishna Intro First Look Teaser | Akhanda 2 Movie  Teaser | Boyapati Srinu - YouTube

ఈ సినిమా వ‌ర్క్ న‌డుస్తుండ‌గానే అటు బోయ‌పాటి త‌న టీంతో అఖండ 2 సినిమా మీద వ‌ర్క్ చేస్తున్నాడు. అక్టోబ‌ర్ 20న ద‌స‌రా కానుక‌గా రామ్‌, బోయ‌పాటి మూవీ రిలీజ్ అవుతుంది. ఆ వెంట‌నే న‌వంబ‌ర్ నుంచి అఖండ 2 సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క‌ట‌న‌తోనే నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే ఇక నంద‌మూరి ఫ్యాన్స్‌ను ఆప‌లేం.