Lahari : బిగ్ బాస్ సీజన్ 5లో అలరించిన లహరి షరి బిగ్ బాస్ తర్వాత పెద్దగా అవకాశాలైతే అందుకోలేదు కానీ ఆడియన్స్ లో ఓ ఐడెంటిటీ మాత్రం తెచ్చుకుంది. బిగ్ బాస్ వల్ల సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకున్న లహరి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. ఓ మంచి బ్రేక్ కోసం చూస్తున్న అమ్మడు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం హాట్ షో చేస్తుంది.

ఈమధ్య భామలందరికి ఫోటో షూట్స్ చాలా కామన్ అయ్యింది. అందాలతో రెచ్చిపోతూ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. లహరి కూడా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. గ్లామర్ షోకి తాను రెడీ అంటున్నట్టుగా హింట్ ఇస్తూ అమ్మడి ఫోటో షూట్ ఉంది. హాట్ లుక్స్ లో లహరి అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న లహరి అలాంటి ఛాన్స్ వస్తే ఓ రేంజ్ లో రెచ్చిపోయేలా ఉంది.

లహరి షరి తెలుగు అమ్మాయి కాబట్టి అవకాశాలు రావట్లేదా లేక నిజంగానే ఆమె బ్యాడ్ లక్కా అన్నది పక్కన పెడితే. ఈ హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టడం ఫిక్స్ అని చెప్పొచ్చు. లహరి షరి చేస్తున్న ఈ హాట్ షో చూసి ఈ కష్టం ఏదో సినిమాలో పడితే మంచి ఫాలోయింగ్ వస్తుందని అంటున్నారు. మొత్తానికి లహరి కూడా తన హాట్ లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేయాలని చూస్తుంది.
