బాహుబలి సినిమా.. రెండు పార్టులగా వచ్చిన ఈసినిమా దేశ విదేశాల్లోని ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సినిమా సృష్టించిన మానియా అంతా ఇంతా కాదు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళీ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సునామి సృష్టించింది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఘనత మాత్రం ఆర్కా మీడియాకు దక్కుతుంది. ఈ ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరిలు.
అయితే ఇప్పుడు ఇదే నిర్మాతలు ఓ కొత్త తరహా చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాను చేసిన దర్శకుడు వెంకటేశ్ మహా. ఈ దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంది. అయితే వెంకటేశ్ మహా ఈ సినిమా తరువాత ఎలాంటి ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు. ఈ దర్శకుడు ఎలాంటి చిత్రం చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఓ ఆసక్తి కరమైన టైటిల్‌తో ముందుకు వచ్చారు.
బాహుబలి నిర్మించిన ఆర్కా మీడియా నిర్మాతలు వెంకటేశ్ మహా తో జట్టు కట్టారు. మళయాళంలో ఫర్హాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం మహేశింతే ప్రతీకారం అనే సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్యే అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో స్యతదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అరకు నేపథ్యంలో కేవలం 36రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రీల్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ చిత్ర టైటిల్‌తో బాహుబలి నిర్మాతలు సినిమా చేయడం విశేషం.