టాలీవుడ్ ప్రిన్స్, టాప్ హీరో, సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంక్రాంతికి సందడి చేయబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతుంది. 2020 జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్టీ స్టేడియంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు ముమ్మరం చేసింది. అదే విధంగా సినిమాకు సంబంధించిన బిజినెస్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఓ హాట్‌టాపిక్ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది.
టాలీవుడ్‌లో టాప్ హీరోగా ప్రేక్షకుల నిరాజనాలు అందుకుంటున్న ప్రిన్స్ మహేష్‌బాబు సినిమా వస్తుందంటే అభిమానుల జోరు అంతా ఇంతా కాదు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమా రాబోతుందనగానే చిత్ర పరిశ్రమలో జోష్ నిండింది. టాలీవుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా యమా క్రేజ్ నెలకొన్న ఆ సినిమాపై ఇప్పుడు జోరుగా చర్చనడుస్తున్న ఆంశం ఏదైనా ఉందంటే.. అది అమెరికాలో మహేష్‌బాబు సినిమాకు టికెట్ ధర ఎంత నిర్ణయించారు అనేదే. అయితే యూఎస్‌లో మహేష్‌బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు యూఎస్‌లో ఈ సినిమా టికెట్ ధర వింటే అందరు షాక్ కావాల్సిందే.
అమెరికాలో ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకు టికెట్ ధరను ఇప్పటికే నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో టికెట్ ధరను 20 నుంచి 21 డాలర్ల వరకు నిర్ణయించారని సమాచారం. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ. 1500లు అన్నమాట. అంటే మహేష్‌బాబు సినిమా చూడాలంటే అంత ధర వెచ్చించి టికెట్ కొనాలన్న మాట. మహేష్‌బాబు స్టామినాకు ఈ టికెట్ ధరలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటంతో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్‌బాబు సరసన అందాల బొమ్మ రష్మీక మందన్నా నటిస్తుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో.. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు ఇప్పటికే కొబ్బరికాయ కొట్టారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటూ.. ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి బరిలో బన్నీ నటించిన అలా వైకుంఠపురములో సినిమాతో పోటీలో ఈ సినిమా ఉంది.