దేవుడా దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే అక్కినేని హీరోలే… ఇంత దారుణమా…!

అక్కినేని హీరోలకు ప్రస్తుతం టైం అసలు కలిసి రావడం లేదు.. ఈ హీరోల దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలిపోతూ నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. గత సంవత్సరం కాలంలో అక్కినేని హీరోల సినిమాలు మిగిల్చిన నష్టాలు ఏకంగా రూ.100 కోట్ల మించిపోయినట్టు తెలుస్తుంది. ది ఘోస్ట్, థాంక్యూ, ఏజెంట్, కస్టడీ సినిమాల ద్వారా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి.

Nagarjuna And Sonal Chauhan's The Ghost Will Be Streamed On The OTT  Platform From This Date

నాగచైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చ‌ద్దా సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరో అమీర్ ఖాన్ కావడంతో చైతన్య మరో భారీ నష్టం నుంచి తప్పించుకున్నాడు. ఆ మాట‌కు వ‌స్తే నాగార్జున ది ఘోస్ట్ మాత్ర‌మే కాదు.. అంత‌కు ముందు చేసిన ది వైల్డ్‌డాగ్ – ఆఫీస‌ర్ సినిమాలు కూడా ఘోరాతి ఘోర‌మైన డిజాస్ట‌ర్లు అయ్యాయి.

Custody Trailer (Telugu) | Naga Chaitanya | Krithi Shetty | Yuvan Shankar  Raja | Venkat Prabhu - YouTube

ఇలా అక్కినేని హీరోల మిగిల్చిన నష్టాలు అన్ని ఇన్ని కావు.. నిర్మాతలు సైతం అక్కినేని హీరోలతో సినిమాలు చేయాలంటే భ‌య‌పడాల్సిన పరిస్థితి. కథల ఎంపిక విషయంలో అక్కినేని హీరోలు పొరపాట్లు చేస్తున్నారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. వారు అగ్ర దర్శకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేనే వారి కెరీర్ బాగుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

I will come back stronger: Akhil's touching note on Agent's failure |  123telugu.com

వచ్చే సంవత్సరం అయిన‌ అక్కినేని హీరోలకు కలిసి వస్తుందా ? అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి వరుసగా ఇన్ని డిజాస్టర్లు ఇచ్చిన హీరోలు టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఇక మరి అక్కినేని హీరోలు రాబోయే రోజుల్లో ఆయన సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.