‘ బేబీ ‘ రివ్యూ: అన్న‌ను మించిన హిట్ కొట్టేసిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ అన్న బాట‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దొర‌సాని సినిమా అనుకున్న స‌క్సెస్ కాక‌పోయినా కూడా న‌టుడిగా ఆనంద్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక తాజాగా యువ ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా బేబీ. ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ‌వ్ వైబ్స్ వ‌చ్చాయి. ప్రీమియ‌ర్లు కూడా వేశారు. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

ఈ సినిమా క‌థ‌లోకి వెళితే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఓ ఆటో డ్రైవర్గా ఉంటాడు. బ‌స్తీలోనే త‌న ఎదురింటి అమ్మాయి వైష్ణవి (వైష్ణవి చైతన్య)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. టెన్త్ త‌ర్వాత‌ వైష్ణవి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతుంది. కాలేజీలో ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అయ్యాక వీరి ప్రేమ‌క‌థ‌లో అనూహ్య మ‌లుపులు చోటు చేసుకుంటాయి. ఆ త‌ర్వాత వైష్ణవి జీవితం ఎలా సాగింది ? విరాజ్ పాత్ర ఏమిటి ?, చివరకు ఈ ప్రేమ‌లో ఆనంద్ గెలిచాడా ? అన్న‌దే మిగిలిన స్టోరీ.

ఈ సినిమాకు ఎమోష‌న‌ల్‌గా సాగే ల‌వ్ ట్రాక్‌, ఆనంద్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో ఎమోష‌న్లు, వైష్ణ‌వి పాత్ర‌లో బ‌ల‌హీన‌త‌లు ఇవ‌న్నీ సినిమా రేంజ్ పెంచాయి. పాఠ‌శాల‌, కాలేజ్‌లో ఈ త‌రం ప్రేమ‌క‌థ‌లు ఎలా ఉంటాయో.. చిన్న చిన్న పొర‌పాట్ల కార‌ణంగా యువ‌త లైఫ్‌లో ఎలా బ్యాలెన్స్ తప్పుతున్నారో బాగా చూపించారు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. ఆనంద్ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌తో అనుక్ష‌ణం న‌ర‌కం అనుభ‌విస్తూ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు.

హీరోయిన్ వైష్ణ‌వి ఎమోష‌న‌ల్ సీన్ల‌లో త‌న పెయిన్ అర్థ‌మ‌య్యేలా క‌ళ్ల‌తోనే ప‌లికించిన హావ‌భావాలు అద్భుతం. ద‌ర్శ‌కుడు సాయిరాజేష్ నేటి యువ‌త జీవితాలు, ప‌రిస్థితుల ఆధారంగా రాసుకున్న క‌థ‌, తెర‌కెక్కించిన తీరు అద్భుతం. కొన్ని చోట్ల సినిమా స్లోగా సాగుతూ ల్యాగ్ అయిన‌ట్టున్నా, ఫ‌స్టాఫ్ ప్రేమ‌క‌థ‌లో కొన్ని సీన్లు రొటీన్‌గా ఉన్నా సినిమా అద్భుతంగా ఉంటుంది.

ఫైన‌ల్‌గా…
బేబీ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా మంచి ఫీల్ గుడ్ సీన్ల‌తో ఆక‌ట్టుకుంటుంది. ప్రేమలో నేటి యువత చేసే పొరపాట్లను బాగా చూపించారు. డీసెంట్ కంటెంట్‌, డీసెంట్ టేకింగ్‌, మేకింగ్ ఈ సినిమా రేంజ్ పెంచాయి. స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. ఓవ‌రాల్‌గా ఆనంద్‌కు మంచి హిట్ బొమ్మ‌.

బేబీ రేటింగ్‌: 3 / 5