ప్ర‌భాస్ విల‌న్‌కు, ప‌వ‌న్‌కు అమ్మ మ‌ధ్య ఈ ఫ్యామిలీ గొడ‌వ ఏంట్రా బాబు..!

సంపత్ రాజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనదైన బాడీ లాంగ్వేజ్ తో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటించిన ” మిర్చి ” సినిమాలో విలన్ రోల్ ప్లే చేసిన సంపత్ రాజ్ ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంపత్ రాజ్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. అన్నగా, తండ్రిగా, విలన్‌గా ఇలా అనేక పాత్రల్లో తెలుగు సినిమాల్లో నటిస్తూ సౌత్ లోని పలు భాషల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే తన నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంపత్ రాజ్ ఒకానొక దశలో ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడట. అత‌డి జీవితంలో సమస్యలు ఎంత‌గా బాధించాయో అర్థం చేసుకోవచ్చు. సంపత్ రాజ్‌ని పెళ్లి చేసుకుని ఒక కూతురు పుట్టిన తర్వాత నెలల వయసులో కుమార్తెను వదిలేసి మొదటి భార్య ఇతనికి విడాకులు ఇచ్చేసింది. దాంతో సంపత్ రాజు ఒంటరిగానే తన కూతురిని పెంచాడు.

ఆమె పెరిగి పెద్దదైన తర్వాత తాజాగా రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం కుటుంబ పరంగా సంతోషంగా జీవిస్తున్నాడు. కానీ మొదటి భార్యతో విడాకుల విషయంలో ఆయన చాలా బాధకు గురయ్యాడని స్వయంగా సంపత్ రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక సంపత్ రాజ్ మొదటి భార్య గురించి తెలియని చాలామంది ఒక నటిని సంపత్ రాజ్ భార్య అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆమె మరెవరో కాదు నటి శరణ్య.

” కొమరం పులి ” సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తల్లి పాత్రలో నటించి మెప్పించింది. శరణ్య సంపత్ రాజ్ మొదటి భార్య అని ఒకప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి. వాస్తవానికి శరణ్యకు సంపత్ రాజ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నటి శరణ్య తమిళ నటుడు పొన్వ‌న‌న్‌ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుత శరణ్యకు సంపత్ రాజ్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వ‌చ్చింది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ భార్యాభర్తలు అంటూ తప్పుడు ప్రచారాలు జరపడం ఇక‌నైనా అగుతాయో? లేదో? చూడాలి.