మామ‌ను మించిన క‌టౌట్‌… మ‌హేష్‌బాబుకు ఈ కుర్ర హీరో ఏమ‌వుతాడు.. ఎవ‌రి కొడుకో తెలుసా..!

సూపర్ స్టార్‌గా మహేష్ బాబుకి టాలీవుడ్‌లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు 50 ఏళ్లు వస్తున్నా ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఈ ఫోటోలో అబ్బాయిని గుర్తుపట్టారా ?

ఇంతకీ అచ్చం మహేష్ బాబునే పోలి.. మ‌హేష్ క‌టౌట్‌ను మించి ఉన్న ఈ అబ్బాయి ఎవరు ? అనుకుంటున్నారా..! మహేష్ బాబు సోదరి ప్రియదర్శి – హీరో సుధీర్ బాబుల పెద్ద కొడుకు చరిత్ మానస్. రూపంలోనే కాదు ఆటిట్యూడ్, క్యారెక్టర్ లోను కూడా మహేష్ బాబుని పోలి ఉంటాడు చ‌రిత్. ఇప్పటికే కొన్ని సినిమాల్లో బాల‌నటుడుగా నటించాడు.

చ‌రిత్ టీనేజ్‌కి వచ్చిన తర్వాత పిక్ సోషల్ మీడియాలోకి రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం చరిత్ మానస్ కి సంబంధించిన ఓ వీడియో, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నెట్టిజ‌న్లు చరిత్ అచ్చంగా మామయ్య మహేష్ బాబుకి జిరాక్స్‌లా ఉన్నాడంటూ చరిత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే మామయ్యకు గట్టి పోటీ ఇస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

చరిత్‌ను ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేసేందుకే తండ్రి సుధీర్ బాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మహేష్ బాబు అల్లుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మామను మించిన అల్లుడుగా గుర్తింపు తెచ్చుకుంటాడో? లేదో? చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Charith Manas (@charith_2222)