పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు అటు హరీశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఓజీ సినిమాలో పవన్ కు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాహో తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఓజీ కోసం పవన్ కంటిన్యూగా కాల్ సీట్లు ఇచ్చారు. ఇటీవల మూడో షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక ఈ షెడ్యూల్లో పవన్ తో పాటు మరో యంగ్ ఫేమస్ నటుడు కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
ఆ నటుడు ఎవరో ? కాదు తన బేస్ వాయిస్తూ టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ మంచి ఫేమ్ ఉన్న నటుడు అర్జున్ దాస్ అని తెలుస్తోంది. అర్జున్ దాస్ ఓజి సెట్స్‌లో జాయిన్ అయ్యాడని మేకర్లు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అర్జున్‌దాస్ సెట్‌లో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అర్జున్‌దాస్ వాయిస్ లో పవన్ పై సరైన డైలాగులు పడితే సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓజి సినిమాలో పవన్ ముంబైలో ఉండే గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. ముంబై క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని.. పవన్ సరికొత్త స్టైల్ లో ఉంటాడని తెలుస్తోంది. ఓజీ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.