వైసీపీ యంగ్ లీడ‌ర్ బైరెడ్డికి అసెంబ్లీ సీటు… జ‌గ‌న్ షాక్ ఏ ఎమ్మెల్యేకు…!

వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారా? అంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజకీయాలని చూస్తే అవుననే అనిపిస్తుంది. నెక్స్ట్ ఎన్నికల బరిలో దిగాలని బైరెడ్డి ఆతృతతో ఉన్నారు. అయితే జగన్ సీటు ఇస్తారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. చాలా తక్కువ కాలంలోనే బైరెడ్డి యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయనకు బాగా ఫాలోయింగ్ వచ్చింది. వైసీపీ యువత బైరెడ్డిని విపరీతంగా అభిమానిస్తున్నారు.

ఎక్కడో కర్నూలుకు చెందిన బైరెడ్డికి కోస్తా, ఉత్తరాంధ్రల్లో కూడా బ్యానర్లలో కనిపిస్తున్నారంటే..వైసీపీ యువత ఎంతగా అభిమానిస్తున్నారో తెలిసిందే. ఇలా క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని వైసీపీ యువత భావిస్తుంది. ఆ దిశగానే బైరెడ్డి కూడా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీలో ఇటీవల వరుస పదవులు వచ్చాయి. శాప్ ఛైర్మన్ పదవితో పాటు..వైసీపీ యువ విభగానికి అధ్యక్షుడు అయ్యారు. దీంతో ఆయన దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

చాలా కాలం ప్రతిపక్ష టీడీపీపై పెద్దగా విమర్శలు చేయని, బైరెడ్డి పదవి వచ్చాక..రాష్ట్రమంతా తిరుగుతూ..చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల తాడిపత్రికి వెళ్ళి అక్కడ జేసీ బ్రదర్స్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంటే ఇలా చేయడం వల్ల జగన్ దృష్టిలో పడి సీటు సాధించవచ్చనే కాన్సెప్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బైరెడ్డి సమన్వయకర్తగా ఉన్న నందికొట్కూరు ఎస్సీ సీటు కాబట్టి అది దక్కదు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ ఒక్క సీటు ఖాళీ లేదు. అన్నీ చోట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు..ఎంపీ సీట్లు ఖాళీగా లేవు. ఒకవేళ బైరెడ్డికి సీటు ఇవ్వాలని అనుకుంటే..ఎవరోకరిని తప్పించి సీటు ఇవ్వాలి. మరి జగన్ అలా చేసి ఏ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చి బైరెడ్డికి సీటు ఇస్తారో లేదో చూడాలి.

Tags: intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, YS Jagan, ysrcp