Pragathi Birthday : క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి బర్త్ డే పార్టీ.. వామ్మో ఏంటీ హంగామా..!

Pragathi Birthday : సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూ వస్తున్న ఆమె ఈమధ్య సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ వీడియోస్, ఎక్సర్ సైజ్ వీడియోస్ పెడుతూ అలరిస్తున్నారు. ఈ వయసులో ఆమెకు ఎందుకంత రిస్క్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నారు ప్రగతి.

ఇక మాములుగానే ఓ రేంజ్ లో రెచ్చిపోయే ప్రగతి తన బర్త్ డే నాడు మరింత హంగామా చేసింది. రీసెంట్ గా జరిగిన తన బర్త్ డే పార్టీలో తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రగతి. తన వర్క్ అవుట్ వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వచ్చిన ప్రగతి లేటెస్ట్ గా వారి కోసం తన బర్త్ డే ఫోటోలని షేర్ చేసింది.

బర్త్ డే సందర్భంగా ప్రగతి (Pragathi Birthday)ఇచ్చిన పార్టీలో చాలామంది సెలబ్రిటీస్ పాల్గొన్నారు. బర్త్ డే సందర్భంగా ప్రగతి వేసుకున్న డ్రెస్ కూడా ఫాలోవర్స్ ని అలరిస్తుంది. బర్త్ డే పార్టీలో ప్రగతి హాట్ లుక్ తో కనిపించారు. మరి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ప్రగతి చేస్తున్న ఈ హాట్ షో చూసి కుర్రాళ్లు తెగ ఇబ్బంది పడుతున్నారు.

Tags: Pragathi, Pragathi Birthday, Pragathi Birthday Party, Pragati Tollywood