ఆరోగ్యంగా ఉండటం కోసం ఇప్పుడు గింజలు, ధాన్యాలతో చేసిన ఆహారంపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అవిసె గింజలకు ప్రాధాన్యమిస్తున్నారు. మరి వీటిని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు: తగ్గడంలో అవిసెలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ తో తొందరాగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఉదయాన్నే టిఫిన్ కి బదులుగా ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక చెంచా అవిసె గింజల పొడిని కలుపుకొని తాగితే ఇక ఆకలే వెయ్యదు.
మాంసాహారం: మాంసాహారం తినని వారు అవిసె గింజలు తీసుకోవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ హెచ్డి యాసిడ్లు ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ డి కూడా ఉంటుంది.
క్యాన్సర్: క్యాన్సర్ ని అదుపు చేసే లిగ్నాన్స్ మిగతా ఆహారంలో కంటే అవిసెలలో ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఇస్ట్రాజెన్, యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఆడవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భంలో వచ్చే కణుకులు నిరోధించడానికి సహాయపడుతుంది.
రక్త పోటు: రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచడానికి అవిసెలు బాగా ఉపయోగపడతాయి. ఈ గింజలు కొన్ని నెలల పాటు తిని చూస్తే దాని ఫలితం తెలుస్తుంది.
కొలెస్ట్రాల్: కొంతమందికి శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఎలాంటి మందులు వేసుకున్నా కూడా తగ్గదు. ఆ సమస్యకి విరుగుడు అవిసె గింజలు మంచి ఔషధంలా పనిచేస్తాయి.
కడుపు నొప్పి: అవిసెల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను కూడా తరిమేస్తుంది.
గర్భిణీలు: గర్భిణీలు ,పాలిచ్చే తల్లులు వీటిని తినడం వల్ల… దీంట్లో అధికంగా ఉండే ఈస్ట్రోజెన్ వల్ల శిశువులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీలు ,పాలిచ్చే తల్లులు తప్ప మీగత వారు అందరు ఈ గింజలు తినడం వల్ల చాలా మంచిది.