డబ్బు సంపాదనే ద్యేయంగా కొందరు కేటుగాళ్లు తీరుకో వేషం వేస్తున్నారు. ఆశపోతులను, నిరుద్యోగులకు వల విసురుతున్నారు. అత్యాశకు పోయి వారి బారిన చేతి చమురు వదిలించుకుంటున్నారు కొందరు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏకంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి భార్యను అంటూ ఓ వ్యక్తి వసూళ్లకు తెగబడ్డాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దవాళ్లకు పీఏ అంటూ మోసాలకు పాల్పడడం ఈ మధ్య పెరిగిపోతున్నది. తాజాగా సత్యశ్రీరాం అనే కేటుగాడు అలాంటి వ్యవహారానికే తలపెట్టాడు. ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతికి పీఏను అంటూ ఓ నిరుద్యోగిని నమ్మించాడు. పంచాయతీరాజ్ శాఖ లేదా సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకోసం కొంత మొత్తం ఖర్చవుతుందని తెలిపాడు. దీంతో ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆ నిరుద్యోగి సత్యశ్రీరాం బ్యాంకు అకౌంట్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా రూ. లక్షకు పైగా డబ్బులు వేశాడు. అదే తరహాలో మరో నిరుద్యోగి వద్దా డబ్బులు వసూలు చేశాడు ఆ కేటుగాడు. ఆ తరువాత ఎంతకూ సత్యశ్రీరాం నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సత్యశ్రీరారంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.