అత‌డితోనే నా పెళ్లి. క్లారిటీ ఇచ్చిన అనుష్క‌

చిత్ర‌సీమ‌లో ఏ చిన్న‌వార్త తెలిసినా అది ద‌వాన‌లమ‌వుతుంది. చిలువ‌లు ప‌లువ‌లుగా ప్ర‌చారం సాగుతుంది. అందులో సినీ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన అంశాలైతే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఉన్న‌దానికి.. లేనిదానికి మ‌సాల‌లు ద‌ట్టించి మాట్లాడుకుంటారు. ఫ‌లితంగా సంబంధిత న‌టీన‌టులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స‌రిగా అలాంటి చిక్కుల్లోనే ప‌డింది న‌టి అనుష్క‌. బాహుబ‌లి సినిమా స‌మ‌యంలో ప్ర‌భాస్‌లో ప్రేమ‌లో ప‌డింద‌ని, వారిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. సోష‌ల్ మీడియాలో తెగ చెక్క‌ర్లు కొట్టాయి. ఇక చేసేదేమీలేక వారిద్ద‌రూ బ‌హిరంగా అలాంటిదేమీ లేద‌ని కొట్టిపారేశారు. ఆ వార్త‌ల‌ను ఖండిచారు. ఇక తాజాగా కొద్ది రోజులుగా మ‌ళ్లీ అనుష్క‌పై అలాంటి వార్త‌నే ప్ర‌చారం సాగుతున్న‌ది. టీమిండియా క్రికెట‌ర్‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ క‌న్న‌డ‌భామ స్పందించింది. ఆ వార్త‌లను ఖండించింది.

ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది ఈ స్వీటీ. అయినా అలాంటి వార్త‌లు తరచూ వార్తలు రావ‌డం చాలా బాధను క‌లిగిస్తున్నాయ‌ని వాపోయింది. తాను త‌న తల్లిదండ్రులు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతగాడితోనే తలవంచి తాళి కట్టించుకుంటాననిస త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది ఈ బ్యూటీ. ఇప్ప‌డి వార్త కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అనుష్క అభిమానుల‌కు ఇది ఊర‌ట‌నిచ్చింది.

అయితే అనుష్క ప్ర‌క‌ట‌న మ‌రో చ‌ర్చ‌కు తీరిసింది. తెలుగు చిత్ర‌సీమ‌లో పెళ్లికాని హీరోయిన్ల లిస్టులో ముందుంటుంది ఈ భామ‌. పూరి జ‌గ‌న్నాథ్ తీసిన సూప‌ర్ మూవీలో అక్కిననేని స‌ర‌స‌న రెండో క‌థానాయిక‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ త‌రువాత కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అరుంధ‌తి సినిమాలో లీడ్ రోల్‌ను పోషించి ఒక్కాసారిగా అగ్ర‌క‌థానాయిక‌గా ఎదిగింది. మ‌హిళా ఓరియంటెండ్ పాత్ర‌ల‌ను పోషిస్తున్న‌ది. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి సినిమాతో బాలివుడ్‌లోనూ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో లీడ్ రోల్‌ను పోషిస్తున్న‌ది. త్వరలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికీ ఈ బ్యూటీ బిజీగా ఉంది. అయితే అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? ఆ చ‌ర్చ జోరుగా సాగుతున్న‌ది.

Tags: Anushka Shetty, indian cricketer, marrige, nishbdham, Prabhas