టీం ఇండియా క్రికెట‌ర్‌తో న‌టి అనుష్క వివాహం..!

టాలివుడ్‌లో ప్ర‌ముఖ హిరోయిన్‌గా అనుష్క వెలుగొందుతున్న‌ది. తొలుత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ క‌న్న‌డ భామ ఆపై ఫిమేల్ ఓరియంటెడ్ పాత్ర‌ల‌తో సొంత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అరుంధ‌తి సినిమాతో త‌న న‌ట‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఆపై పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి చిత్రాల‌తోనూ ఆక‌ట్టుకున్న‌ది. ఇక ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి సార‌థ్యంలో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమాలో న‌టించి దేశ‌వ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌రువాత భాగ‌మ‌తి సినిమాతోనూ హిట్టును అందుకుంది. ఇటీవ‌లే కొంత కాలం గ్యాప్ తీసుకుంది. ప్ర‌స్తుతం నిశ్శ‌బ్దం సినిమాను చేస్తున్న‌ది. పీపుల్స్ మీడియా, కోన ఫిల్మ్ మీడియా కార్పొరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, హేమంత్ మ‌ధూక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో, టాలివుడ్‌, కోలివుడ్‌, హాలివుడ్ న‌టీనటుల‌తో పాన్ ఇండియా త‌ర‌హాలో తెర‌కెక్కుతున్న‌ది. ఇక సినిమాకు జాను ఫేమ్ గోపిసుంద‌ర్ సంగీతం అందిస్తుడ‌గా, అనుష్క‌శెట్టి, మాధ‌వ‌న్ , అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌న‌పించ‌నున్నారు. హిందీ, త‌మిళ్‌, మాల‌యాలి, తెలుగు భాష‌ల్లో చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుద‌ల చేసేందుకు భారీస్థాయిల్లో స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. అనుష్క పెళ్లి విష‌య‌మై తాజాగా ఒక విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. త్వ‌రంలోనే ఉత్త‌రాదికి చెందిన ఓ టీం ఇండియా క్రికెట‌ర్‌ను అనుష్క ప‌రిణ‌యం ఆడ‌బోతున్న‌దని స‌మాచారం. ఇప్ప‌డిదే హాట్ టాపిక్‌గా మారింది. టాలివుడ్ వ‌ర్గాలు ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నాయి. గ‌తంలోనూ అనుష్క పెళ్లి విష‌య‌మైన ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. బాహుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్‌, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నార‌ని పుకార్లు షికారు చేసిన సంగ‌తి తెలిసింది. ఆ విష‌యంలో వారిద్ద‌రూ క్లారిటీ ఇవ్వ‌డంతో అక్క‌డితో ఆ అంశంగా ముగిసిపోయింది. తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హాలో క‌న్న‌డ‌భామ పెళ్లి విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కైతే దీనిపై ఆమె ఎలానూ స్పందించ‌లేదు. దీంతో ఇది కూడా రూమ‌ర్ అని కొంద‌రు.. మౌనం అర్థంగీకారం అని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. చూడాలి ఏమ‌వుతుందో?

Tags: anushka sharma, marrige, nishbdham, team india crickter