అక్కినేని సమంత, శర్వానంద్ జంటగా తెరకెక్కిన జాను చిత్రం జాను తెలుగు సినీ అభిమానుల ముందుకు నేడు వచ్చింది.
తమిళలో హిట్టయిన 96 మూవీని తెలుగులో జాను పేరుతో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేయగా, మాతృకను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే దీనికీ దర్శకత్వం వహించాడు. సినిమాకు సంగీతం గోవింద్ వసంత. అందించగా ఆ పాటను శ్రీపాద చిన్మయి పాటడడం విశేషం. తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భావోద్వేగ్నమైన సన్నివేశాలతో సినీ అభిమానులను మురిపిస్తున్నది. అదీగాక 96 సినిమా స్థాయిలోనే ఉందని టాలివుడ్ వర్గాలు చెబుతుండడం విశేషం. విజయ్‌సేతుపతి, త్రిష మధ్య ఏ కెమిస్ర్టీ వర్కవుట్ అయిందో, దానిని శర్వానంద్, సమంత సైతం మరోసారి ఆన్‌స్క్రీన్‌పై పండించారని అభిమానుల అభిప్రాయం.
కొద్ది రోజులకు ముందే చిత్ర యూనిట్ విడుదల చేసిన సినిమా ప్రచార వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. విజువల్స్ కళ్లను కట్టిపడేశాయి. దక్షిణాప్రిక ప్రకృతి అందాలును అద్వితీయంగా చూపుతూ లైఫ్ ఆఫ్ రామ్ పాటతో హీరో శర్వానంద్ ఎంట్రీతో సినిమా మొదలవుతుంది. స్లోగా కథలోకి ప్రేక్షకులను లాగుతుంది. హిరో చిన్నతనంలోని లవ్ స్టోరీ ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు హైలట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. మొత్తంగా తమిళ సినిమా రీమెక్ అయినా ఆ ఆనవాళ్లు సినిమాలో ఎక్కడా కనిపించవని ప్రేక్షకులు తెలుపుతున్నారు. బాల్యంలో ప్రేమించిన ప్రతి ఒక్కరినీ సినిమా హత్తుకుంటుందని వివరిస్తున్నారు. ఒరిజినల్ ఫ్లేవర్‌కు ఏమాత్రం తగ్గకుండా శర్వానంద్, సమంతలు జీవించేశారు.
బుర్ర సాయిమాధవ్ రాసిన ‘‘ఎగిసిపడే కిరటాల్లో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు నీ చూపు అప్పు ఈయలేవా” సంభాషణలు ప్రేక్షకుల గుండెలను తాకుతాయి. “ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏదో జరగపోతుందని మనసుకి మాత్రం ముందే తెలుస్తుంది” అంటూ సమంత చెప్పే డైలాగ్.. ‘పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్ సొంతం అయితే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా సొంతమే’ అని శర్వానంద్ చెప్పే డైలాగ్కు థియేటర్లలో విజిల్స్ మోగుతున్నాయి. ఉహలే ఉహలే పాట కూడా రంజిపజేస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైప్ ఇచ్చే విధంగా ఉంది. గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మహేందరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా ‘96’ చిత్రానికి రీమేక్ కాబట్టి.. ఆ సినిమాతో పోలిక తప్పనిసరి అయితే.. సమంత, శర్వానంద్‌లు నటనలో విజయ్ సేతుపతి, త్రిషలను బీట్ చేయలేకపోయారనే ఫీల్ అయితే కలిగినా ఎవరి స్టైల్లో వారు నటించారని ప్రేక్షకులు కితాబిస్తున్నారు.