అనుష్క‌, ఆర్తీ కాంబినేష‌న్లో ప‌వ‌న్ మిస్ అయిన సినిమాలివే… ఈ ఇద్ద‌రితో ఎందుకు న‌టించ‌లేదంటే…?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగి అన్నను మించిన స్టార్ డమ్‌ను అందుకునీ పవర్ స్టార్ గా టాలీవుడ్ లోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన చేసే సినిమాలతో కొత్త కొత్త దర్శకుల‌నే కాకుండా కొత్త కొత్త హీరోయిన్లు కూడా ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఇప్పటివరకు సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడాా చేయలేదు.

అనుష్క సైతం టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ తో ఆమె నటించిన లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో పవన్ కళ్యాణ్- అనుష్క కాంబినేషన్ కూడా ఒకటి. ఇదే సమయంలో ఇందులో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. గతంలోనే వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ సినిమా మిస్సయింది. ఆ హిట్ సినిమా ఏదో కాదు అన్నవరం.

సీనియర్ ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాసరావు తెర‌కెక్కించిన ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు జంటగా అశిన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సంధ్యా వేణుమాధవ్ నాగబాబు, ఆశిస్ విద్యార్థి, శివ బాలాజీ అంటే అగ్ర నటులు కీలక పాత్రలో నటించారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా అనుష్క శెట్టిని అనుకున్నార‌ట‌.

అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ చేయడంతో ఆమెను ఈ సినిమాలో తీసుకోవడానికి దర్శకుడు ఒప్పుకోలేదట. చివరి నిమిషంలో అనుష్క శెట్టి స్థానంలో ఆశిన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇలా వీరిద్దరి కాంబోలో ఈ సినిమా మిస్సయింది. ఇక పవన్ కళ్యాణ్ అనుష్కతోనే కాకుండా మరో హీరోయిన్క మ‌రో హీరోయిన్‌లో త‌న కెరీర్‌లో ఆస‌లు సినిమా చేయలేదు.

దివంగత నటి ఆర్తి అగర్వాల్ గతంలో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఉంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. అయినా పవన్ కళ్యాణ్- ఆర్తి కాంబోలో మాత్రం సినిమా రాలేదు. ఇక అదే సమయంలో గుడుంబా శంకర్ సినిమాలో ఆర్తి అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకుందామని అనుకున్నా అది మధ్యలో కుదరలేదు.

ఇలా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో సినిమా చేయలేకపోయాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ‌రుస సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తూ తన కెరీర్లు దూసుకుపోతున్నాడు.