పేరుకు త‌గ్గ‌ట్టే ‘ పంచ్ ‘ మ‌ర్తి అనూరాధ పంచ్… వైసీపీ గింగ‌రాలు…!

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి ముందు నుంచి ఎలా ? భయపడిందో చివరకు ఆ భయం నిజం అయింది. బలం లేకపోయినా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఇంటి పేరుకు తగ్గట్టే గట్టి పంచ్ విసిరారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసిపిని టిడిపి చావు దెబ్బతీసింది. దీంతో వైసిపి గింగరాలు తిరుగుతోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి మూడు చోట్ల విజయం సాధించింది.

Panchumarthi Anuradha: Latest News, Videos and Photos of ...

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలలో విజయం సాధించి సత్తా చాటాలని వైసిపి సర్వశక్తులు వడ్డింది. చివరికి ఇక్కడ కూడా టిడిపి 23 ఓట్లు సాధించి విజయం సాధించడంతో.. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో కూడా జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని రుజువైంది. ఇది వైసీపీకి నిజంగా అతిపెద్ద షాక్ అని చెప్పాలి. జగన్ తమ పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కోరినట్టుగా నిధులు కేటాయింపుతో.. పాటు వాళ్ళు అడిగిన అన్ని పనులు చేస్తామని చెప్పారు.

YSR Congress Party - Wikipedia

అయినా కొందరు ఎమ్మెల్యేలు జగన్‌ను నమ్మలేదు. అసలు టిడిపి బలం 19 మంది మాత్రమే.. ఆ పార్టీ అభ్యర్థి అనురాధ విజయం కోసం మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇప్పటికే ఇద్దరు వైసిపి రెబ‌ల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరు కూడా టిడిపికి ఓటు వేస్తారని ముందు నుంచి అనుకున్నారు. ఇప్పుడు వారిద్దరితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిడిపికి ఓటు వేయటం వైసిపికి పెద్ద షాకింగ్ విషయం.

Panchumarthi Anuradha – TDP leader from Vijayawada – hello ap

టిడిపి ఒకరి మద్దతు చాలు అనుకుంటే.. ఏకంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి అండగా నిలబడటం చాలా అద్భుతం అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థ‌మ‌వుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తారని ప్రచారం జరుగుతుండగా.. జగన్ తర్వాత వ్యూహం ఎలా ? ఉంటుందో చూడాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, panchamurthi anuradha, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan